హాస్పిటల్‌లో చేరిన రకుల్ ప్రీత్ సింగ్.. 6 రోజులుగా బెడ్‌పైనే.. ఏం జరిగిందంటే?
తెలుగు, హిందీ సినిమా రంగాల్లో రాణిస్తున్న టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రమైన గాయాలతో హాస్పిటల్‌లో చేరారు. ఫిట్‌నెస్, వర్కవుట్‌ను పిచ్చిగా చేసే సమయంలో ఆమె ప్రదర్శించిన అత్యుత్సాహం హాస్పిటల్‌లో చేరేలా చేసింది. దాంతో ఆమె స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడంతో స్వయంగా ఆమె హస్పిటల్ బెడ్ నుంచి వీడియోను రిలీజ్ చేశారు. తన హెల్త్ అప్‌డేట్‌ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఇండియన్ సినిమా రంగంలో ఫిట్‌నెస్‌పై అత్యంత శ్రద్ద చూపే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్. అమె తన బాడీని ఫిట్‌గా ఉంచుకొనేందుకు నిరంతరం ఆమె జిమ్ వెళ్తూ కనిపిస్తుంటుంది. పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా వెయిట్స్, ఎరోబిక్స్, వర్కవుట్ చేస్తూ వీడియోలు పెడుతుంటుంది. ఆమె పడే కష్టానికి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు.

అయితే అలా మితీమిరిన ఉత్సాహంతో రకుల్ చేసిన వర్కవుట్స్ శృతిమించడంతో వెన్నెముకకు తీవ్ర గాయమైంది. దాంతో ఆమెను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. గత 6 రోజులుగా ఆమె హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరో 8 రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అయితే తాను చేసిన ఈ పిచ్చి పని వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆమె తన వీడియోలో వెల్లడించారు.
సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ.. నన్ను అభిమానిస్తూ ఆందోళనకు గురైన నా ఫ్యాన్స్‌కు నా హెల్త్ అప్‌డేట్ ఇవ్వాలని అనుకొన్నాను. నేను వర్కవుట్ చేసేటప్పుడు చేసిన పిచ్చి పనికి నాకు తీవ్రమైన గాయం అయింది. నేను స్టూపిడ్ పని చేశాను. నా మైండ్ చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా చేసిన పనికి తీవ్రగాయమైంది అని వీడియోలో తెలిపారు.

నీ శరీరం భరించలేదని చెప్పినప్పుడు వినాలి. నా బాడీ కంటే మానసికంగా స్ట్రాంగ్ ఉంటానని భావించాను. దాంతో శరీరంపై విపరీతమైన ఒత్తిడి, భారం వేశాను. దాంతో నేను తీవ్రంగా గాయపడ్డాను. దాంతో హాస్పిటల్‌లో చేరాను. త్వరలోనే నేను కోలుకొని మరింత ధృడంగా, మానసికంగా స్ట్రాంగ్ అవుతానని నమ్మకం ఉంది. నాపై ప్రేమను, అభిమానాన్ని కురిపిస్తున్న వారందరికీ లాట్స్ ఆఫ్ లవ్ అంటూ రకుల్ వీడియోలో తెలిపారు.
రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె గ్రాఫ్ అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల ఆమె నటించిన ఆయలాన్, ఇండియన్ 2 సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. అంతకు ముందు నటించిన చిత్రాలు కూడా ఆశించినంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఇండియన్ 3, దే దే ప్యార్ దే 2 సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల వివాహం చేసుకొన్న ఆమె దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications











