Rakul Preet Singh: జారి పోతున్న డ్రెస్​తో రకుల్​ ప్రీత్ సింగ్​ సోకుల విందు..

పంజాబీ భామ, ఫిట్​నెస్ ముద్దుగుమ్మ రకుల్​ ప్రీత్​సింగ్​ కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాతో అంతగా గుర్తింపు తెచ్చుకోని ఈ కూల్ బ్యూటీ సందీప్​ కిషన్​ హీరోగా చేసిన వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​ మూవీతో కాస్త పాపులర్​ అయింది. ఇందులో ఆమె చేసిన ప్రార్థన పాత్రకు యాత్​ ఫిదా అయింది. ఇక ఈ సినిమా తర్వాత రఫ్​ వంటి చిన్న సినిమాలు చేసిన పెద్దగా ఒరగలేదు. కానీ గోపిచంద్​ లౌక్యం సినిమా తర్వాత వరుసగా అగ్ర హీరోలతో జత కట్టింది ఈ ఫిట్​నెస్​ సుందరి. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు లేవు కానీ, హిందీలో మాత్రం చేతినిండా ప్రాజెక్ట్స్​తో దూసుకుపోతున్న రకుల్​ తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసిన పిక్స్​ వైరల్​గా మారాయి. ​

అగ్ర హీరోలతో..

అగ్ర హీరోలతో..

కెరటం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్​ ప్రీత్ సింగ్​ అనతి కాలంలోనే స్టార్​ హీరోయిన్​గా మారిపోయింది. వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ తర్వాత రఫ్​, లౌక్యం సినిమాల్లో చేసిన రకుల్​ అనంతరం కరెంట్​ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి తదితర సినిమాల్లో నటించి అగ్ర హీరోలతో జతకట్టింది. తర్వాత టాలీవుడ్​లో జెండా ఎత్తేసి.. బాలీవుడ్​ సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్​ అయిపోయింది.

బాలీవుడ్​ చిత్రాలే కాకుండా..

బాలీవుడ్​ చిత్రాలే కాకుండా..

ప్రస్తుతం బాలీవుడ్​లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ కూల్ బ్యూటీ. ఇప్పటికే ఆమె నటించిన రన్​ వే 34, అటాక్​ విడుదలైన అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. అయినా రకుల్​కు అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం డాక్టర్​ జీ, ఛత్రీవాలీ, కట్ పులిట్, థ్యాంక్ గాడ్​ వంటి బాలీవుడ్​ సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు తమిళ్ మూవీస్​ అయలాన్, భారతీయుడు 2లో రకుల్​ ప్రీత్ సింగ్​ హీరోయిన్​గా చేస్తున్న విషయం తెలిసిందే.

వైరల్​గా మారిన లేటెస్ట్ పిక్స్​..

వైరల్​గా మారిన లేటెస్ట్ పిక్స్​..

ఇదిలా ఉంటే సినిమాలతోపాటు సోషల్​ మీడియాలో ఫుల్​ యాక్టివ్​గా ఉంటుంది ఈ కూల్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్​గా మారి యూత్​కు పిచ్చెక్కిస్తోంది. బ్లాక్​ డ్రెస్​ ధరించిన రకుల్​ ప్రీత్ సింగ్​ యూత్​ను అట్రాక్ట్ చేస్తోంది. జారిపోతున్న జాకెట్​లో పరువాలను ప్రదర్శిస్తూ సోకుల విందు వడ్డించింది. డిఫరెంట్ ఫ్యాషన్​ వేర్​లో రకుల్​ను చూసిన నెటిజన్లు సో కూల్​ అంటూ ప్రశంసిస్తున్నారు.

డ్రగ్స్​ కేసులో ఇరుక్కున్న కూల్ బ్యూటీ..

డ్రగ్స్​ కేసులో ఇరుక్కున్న కూల్ బ్యూటీ..

కాగా ఆ మధ్యన టాలీవుడ్​లో డ్రగ్స్​ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో ఎంతోమంది సెలబ్రిటీలతో పాటు రకుల్ ప్రీత్ సింగ్​ కూడా ఇరుక్కుని ఇబ్బందిపడింది. ఇక ఆ వివాదం సద్దుమణగడంతో తనపని తాను చేసుకుంటూ పోతోంది ఫిట్​నెస్ బ్యూటి. సినిమాలే కాకుండా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ కొరియోగ్రాఫర్​ డింపుల్​ వద్ద రకుల్​ డ్యాన్స్​ నేర్చుకుంటున్న విషయం తెలిసిందే.

ప్రియుడితో కలిసి..

ప్రియుడితో కలిసి..

అప్పుడప్పుడు పలు షార్ట్​ డ్యాన్స్​ వీడియోస్​ అప్​లోడ్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల మషూక అనే మ్యూజిక్​ వీడియో చేసింది రకుల్​. ఈ మ్యూజిక్​ వీడియో రకుల్​ ప్రీత్​ సింగ్​గా అల్ట్రా గ్లామరస్​గా కనిపించి, తన డ్యాన్స్​తో వావ్​ అనిపించింది. ఈ వీడియో సింగిల్​ను తన బాయ్​ఫ్రెండ్​, నిర్మాత జక్కీ భగ్నానీతో కలిసి రూపొందించింది. అయితే జక్కీ భగ్నానీతో రకుల్ ప్రీత్ రిలేషన్​షిప్ బాగున్నా పెళ్లి టాపిక్​ వచ్చే సరికి మాట దాటేస్తుందట ఈ అమ్మడు. ​

 రోజుకు రూ. 3 లక్షలు!

రోజుకు రూ. 3 లక్షలు!


కాగా ఒకప్పుడు హీరోయిన్​గా నటించడానికి రకుల్​ ప్రీత్ సింగ్​ ఒక్కో సినిమాకు రూ. కోటి 50 లక్షలు అందుకునేదట. కానీ, ప్రస్తుతం రోజు వారి పేమెంట్స్​ విధానంలో భాగంగా.. రోజుకు రూ. 3 లక్షల వరకు పారితోషికం డిమాండ్​ చేస్తుందని టాక్​ వినిపిస్తోంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. ఇక రకుల్​ ప్రీత్ సింగ్ చివరిగా తెలుగులో ఉప్పెన ఫేమ్​ వైష్ణవ్​ తేజ్​ సరసన కొండపొలం సినిమాలో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X