షాకింగ్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్.. మన్మథుడు2 డిజాస్టర్‌తో మరింత..

మన్మథుడు2 డిజాస్టర్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ అచితూచి అడుగులెస్తుందట. తెలుగులో పెద్దగా సినిమాలు అంగీకరించని ఈ ముద్దుగమ్మ ప్రస్తుతం నితిన్‌, చంద్రశేఖర్ ఏలేటి చిత్రంలో నటిస్తున్నది. రకుల్‌తోపాటు ఈ చిత్రంలో నితిన్ సరసన ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా మరో హీరోయిన్‌గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో గ్లామర్‌ను పక్కన పెట్టి యాక్టింగ్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తున్నారనే వార్త ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగిస్తున్నది.

ఇక ఈ చిత్రంలో రకుల్ పాత్ర ఓ క్రిమినల్ లాయర్ పాత్రలో నటిస్తున్నారట. పూర్తిగా డీ గ్లామర్ రోల్ కావడం చర్చనీయాంశమైంది. ఆమె పాత్ర రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది అని తెలిసింది. థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర కథ చాలా కొత్తగా, విభిన్నంగా ఉంటుందనేది ఫిలింనగర్‌లో ప్రచారం అవుతున్నది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫి, వెంకట్ నరేష్ రెడ్డి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రం భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Rakul Preet Singh in de glamour role in Nithiin movie

ఈ సినిమా కోసం రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి చదరంగం కాగా, మరో ఏ1 అనే పేరు ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ అయ్యాయి. అయితే ఈ టైటిల్‌ను ఎంపిక చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ప్రసుత్తం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతున్నది.

రకుల్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన మార్జవాన్ చిత్రం నవంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. తమిళంలో శివకార్తీకేయన్‌తో ఓ సినిమా, అలాగే కమల్ హాసన్‌తో ఇండియన్ 2 సినిమాలో కనిపిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X