కెమెరా ముందు కాదు కెమెరా వెనుకనే చేస్తాం.. రకుల్ రొమాంటిక్ ముచ్చట్లు.. డేర్‌గా చెప్పేసింది
Recommended Video
దశాబ్ద కాలంగా దక్షిణాది హీరోయిన్‌గా సత్తా చాటుతూ వస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. అందం, దానికి మించిన అభినయం ఈమె సొంతం. తెలుగు, తమిళ భాషల్లో కుర్ర హీరోలతో పాటు అగ్ర హీరోలతో సహా రొమాన్స్ చేసిన ఈ భామ ఇటీవలే బాలీవుడ్ తెరకు సైతం తన అందాల రుచి చూపించింది. దీంతో ఉత్తరాదిన కూడా ఈమెకు క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో కాసేపు మీడియాతో ముచ్చటించిన రకుల్.. పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.

కష్టాన్ని గుర్తించరు గానీ కామెంట్లు చేస్తారు
సినిమాలు చేసేటపుడు ఎంత కష్ట పడ్డామనే విషయాన్ని ఎవరూ గుర్తించకుండా కేవలం జయాపజయాల ఆధారంగా ఓ హీరోయిన్‌ని జడ్జ్ చేయడం చాలా దురదృష్టకరం అని రకుల్ అంటోంది. గ్లామర్ ప్రపంచంలో విజయాలు వరించడం, అపజయాల బారిన పడటం సాధారణమే అని.. వాటి ప్రకారం హీరోయిన్ టాలెంట్ అంచనా వేయడం సరికాదని చెప్పుకొచ్చింది రకుల్.

కెమెరా ముందు కంటే కెమెరా వెనుకనే చాలా చేస్తాం
హీరోయిన్ అన్నాక కెమెరా ముందు కంటే కెమెరా వెనుక చేయాల్సిన పనులు చాలా ఉంటాయని తెలిపింది రకుల్. నిజ జీవితంలో డైట్ విషయంలో, వ్యాయామం విషయంలో చాలా కఠినంగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇది కేవలం నా విషయంలో మాత్రమే కాదు మిగితా అందరు హీరోయిన్లదీ ఇదే పరిస్థితి అని చెప్పుకొచ్చింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ.

కొన్నిసార్లు అది జరగకపోవచ్చు
''సినిమా విజయం అనేది మనం ఊహించేది కాదు. ఎంత కష్టపడి చేసినా ఒక్కోసారి ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అంతమాత్రాన హీరోయిన్ కష్టం లేదని, ఆమె ఫెయిల్యూర్ అని అనుకోవడం పొరపాటు. జయాపజయాలనే కొలమానంగా తీసుకోవడం మానేసి హీరోయిన్ కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది'' అని రకుల్ పేర్కొంది.

అజయ్ దేవగన్, సూర్యలతో బోల్తా
ఇటీవలే దే దే ప్యార్ దే సినిమాలో అజయ్ దేవగన్ తో రొమాన్స్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. తమిళంలో సూర్య సరసన NGK సినిమాలో కూడా రకుల్ నటించింది. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తమిళ్ లో ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రంలో నటిస్తోంది రకుల్.

నాగార్జునతో రొమాన్స్
ఇక రకుల్ చేస్తున్న తాజా తెలుగు సినిమా మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జునతో రకుల్ చేయనున్న రొమాన్స్ హైలైట్ కానుంది. మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై నెలలో తెలుగు తెరపై నాగ్, రకుల్ రొమాన్స్ చూడబోతున్నాము.


Click it and Unblock the Notifications











