శ్రద్ధగా చదువుకుంటున్న రకుల్.. అందుకే తెలుగు సినిమాలు చేయడం లేదట
హాట్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. గతంలో ఎప్పుడు లేని విదంగా కొంచెం బాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇక తెలుగులో సినిమాలు చేసి చాలా కాలమవుతోంది. మన్మథుడు 2 డిజాస్టర్ దెబ్బకు తెలుగు సైడ్ ఆఫర్స్ సరిగ్గా రావడం లేదు.
ఇకపోతే ఎక్కువగా బాలీవుడ్ సైడ్ ఫోకస్ చేస్తున్న రకుల్ లాక్ డౌన్ సమయంలో ఊహించని విధంగా ముంబైలో ఇరుక్కుపోయింది. మొత్తానికి ఢిల్లీ వెళ్లి ఆరు నెలల తరువాత తన తల్లిదండ్రులను కలుసుకుంది.

ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన పనులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదట. కేవలం MBA పరీక్షల కోసం ఈ బ్యూటీ శ్రద్ధగా చదువుకుంటోందట. డైలీ ఆన్లైన్ క్లాసెస్ కి హాజరవుతోందట. అలాగే అప్పుడప్పుడు తన యూ ట్యూబ్ ఛానెల్ గురించి కూడా ఆలోచిస్తోందట.
లాక్ డౌన్ లేకపోయి ఉంటే రకుల్ ఈపాటికి హిందీ తమిళ్ సినిమాలతో బిజీగా ఉండేది. ఇండియన్ 2 సినిమాలో ఒక కీలకపాత్రలో నటించనున్న రకుల్ హిందీలో కూడా మరో మూడు సినిమాలు చేస్తోంది. ఇక తెలుగులో ఆఫర్స్ వస్తున్నా కూడా వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్లే ఓకే చేయడం లేదని చెబుతున్న రకుల్ మంచి కథ వస్తే.. తప్పకుండా మళ్ళీ టాలీవుడ్ ఆడియెన్స్ ని మెప్పిస్తానని అంటోంది.


Click it and Unblock the Notifications











