For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rakul Preet Singh: స్విమ్ సూట్ లో రకుల్ ప్రీత్ సింగ్ అందాలు.. క్యూట్ స్మైల్ తో పోజులు

  |

  టాలీవుడ్​లో ఒకప్పుడు స్టార్​ హీరోయిన్​గా యూత్​ను అట్రాక్ట్​ చేసిన కూల్​ బ్యూటీ, ఫిట్ నెస్ సుందరి రకుల్​ ప్రీత్ సింగ్​ ప్రస్తుతం తెలుగు వెండితెరకు దూరంగా ఉంది. కానీ బాలీవుడ్​లో మాత్రం జోరుగా హవా చూపిస్తోంది. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. అయితే ఆ సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్న ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా పెట్టే ఫొటోలు, వీడియోలు మాత్రం సూపర్ హిట్​ అవుతున్నాయి. తన గ్లామర్​తో నెట్టింట మెస్మరైజ్​ చేస్తూ యవతను ఆకర్షిస్తోందీ బక్కపలచని అందం. తాజాగా స్విమ్ సూట్ లో దర్శనమిచ్చి కనువిందు చేసింది ఈ భామ.

  హిందీలో మాత్రం హల్ చల్..

  హిందీలో మాత్రం హల్ చల్..

  కెరటం అనే చిన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్​ ప్రీత్ సింగ్​. వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ హిట్ తర్వాత రఫ్​, లౌక్యం సినిమాల్లో చేసిన రకుల్​ అనంతరం కరెంట్​ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి తదితర సినిమాల్లో నటించి అగ్ర హీరోలతో జతకట్టింది. దీంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటి. చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉన్న పంజాబీ అందం హిందీలో మాత్రం హల్ చల్ చేస్తోంది.

  హిందీలో మాత్రం హల్ చల్..

  హిందీలో మాత్రం హల్ చల్..

  ప్రస్తుతం బాలీవుడ్​లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే ఆమె నటించిన రన్​ వే 34, అటాక్​ విడుదలైన అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. ఈ సినిమాల తర్వాత బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కట్ పుట్లి సినిమాతో నేరుగా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ సినిమా పర్వాలేదనిపించుకుంది.

  విడుదలకు సిద్ధంగా ఉన్న థ్యాంక్ గాడ్..

  విడుదలకు సిద్ధంగా ఉన్న థ్యాంక్ గాడ్..

  ఇక రకుల్ నటించిన మరో హిందీ చిత్రం థ్యాంక్ గాడ్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో జోడి కట్టింది ఈ ఫిట్ నెస్ సుందరి. అలాగే డాక్టర్​ జీ, ఛత్రీవాలీ వంటి సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం భారతీయుడు 2 చిత్రంలో కూడా రకుల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మరో హీరోయిన్ గా చందమామ కాజల్ అగర్వాల్ కూడా అలరించనుంది.

  తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు..

  తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు..

  ఫిట్ నెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టవ్ గా ఉంటోంది. తన సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లతో పాటు పలు అప్డేట్స్ ఇస్తూ అభిమానులు, ప్రేక్షకులతో టచ్ లో ఉంటుంది. ఇటీవల మషూక అనే వీడియో ఆల్బమ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఆ పాటను తెలుగులోనూ డబ్ చేశారు. ఇలా కెరీర్ ముచ్చట్లతోపాటు పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకుంటుంది ఈ భామ.

  పింక్ టాప్ స్లీవ్ లెస్ డ్రెస్ లో..

  పింక్ టాప్ స్లీవ్ లెస్ డ్రెస్ లో..

  వర్కౌట్, ఫిట్ నెస్, డ్యాన్స్, అడ్వర్టైజింగ్ వీడియోస్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ తన హాట్ హాట్ అందాలను హద్దు లేకుండా సోషల్ మీడియాలో ఆరబోస్తుంది. ఇప్పటికే తన బక్కపలచని అందాలను ఆరబోసిన ఈ సుందరి తాజాగా మరికొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో కొన్ని పింక్ టాప్ స్లీవ్ లెస్ డ్రెస్ లో తన అందాలను వడ్డించింది. థైస్ అందాలను చూపిస్తూ ఆకట్టుకుంది.

  క్యూట్ స్మైల్ ఎంతో అందంగా..

  క్యూట్ స్మైల్ ఎంతో అందంగా..

  అంతేకాకుండా ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్ ధరించిన మరో ఫొటోను షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ డ్రెస్ లో తన థైస్ అందాలు, రకుల్ ప్రీత్ సింగ్ ఫిజిక్ మెస్మరైజ్ చేస్తున్నాయి. సముద్రం పక్కన ఓ చోట వయ్యారంగా కూర్చొని అట్రాక్ట్ చేస్తుంది ఈ బ్యూటి. అలాగే తన క్యూట్ స్మైల్ ఎంతో అందంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇలా కూడా హైలెట్ అవుతోంది ఈ ఫిట్ నెస్ బ్యూటి.

  English summary
  Tollywood Star Heroine Rakul Preet Singh Shares Her Orange Swimsuit Pic And Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X