ఎద అందాలతో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ.. అలాంటి పోజులతో ఓవర్ డోస్ హాట్ షో!

గిల్లి అనే కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది బ్యూటిఫుల్ భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా కన్నడలో 7జీ బృందావన్ కాలనీ సినిమాకు రీమెక్ గా వచ్చింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్ అయిపోయాక పాకెట్ మనీ కోసం ఈ సినిమా చేసింది. గిల్లీ మూవీ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. కెరటం అనే చిన్న సినిమాతో మొదలు పెట్టి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. దీంతో టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం హిందీలో అనేక సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిన ఈ ఫిట్ నెస్ సుందరి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది.

అనుకున్నంతగా రాని హిట్లు..

అనుకున్నంతగా రాని హిట్లు..



ఒక సమయంలో తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా యూత్​ను అట్రాక్ట్​ చేసింది కూల్​ బ్యూటీ రకుల్​ ప్రీత్ సింగ్​. తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ఫిట్ నెస్ భామ ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో హవా కొనసాగిస్తూ సత్తా చాటుతోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా రకుల్ ప్రీత్ సింగ్ మారిన.. ఆ సినిమాలు మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో 2022లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ హీరోయిన్ గా కూల్ బ్యూటి నిలిచింది.

మొదటి విజయం..

మొదటి విజయం..

తెలుగులో కెరటం అనే చిన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్​ ప్రీత్ సింగ్​. ఈ సినిమాలో సంగీతగా గోల్స్ కోసం కష్టపడే కాలేజీ గర్ల్ గా అలరించింది రకుల్. అయితే ఆ సినిమా అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఈ సినిమా తర్వాత రకుల్ కు సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ మూవీలో అవకాశం లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రంలో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టుకునేలా అలరిచింది.

 ఫిట్ నెస్ తో ఎంటర్టైన్ చేసి..

ఫిట్ నెస్ తో ఎంటర్టైన్ చేసి..

వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ సినిమా తర్వాత ఆది సాయి కుమార్ రఫ్​, గోపిచంద్ లౌక్యం సినిమాల్లో నటించిన రకుల్​ అనంతరం కరెంట్​ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి తదితర సినిమాల్లో నటించి అగ్ర హీరోలతో జతకట్టింది. టాలీవుడ్ అగ్ర హీరోలతో జతకట్టడంతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది ఈ కూల్ బ్యూటి రకుల్. అయితే చాలాకాలంపాటు తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో, ఫిట్ నెస్ తో ఎంటర్టైన్ చేసిన కూల్ భామ బాలీవుడ్ కి మకాం మార్చింది.

అక్కడ కూడా ఓటమి..

అక్కడ కూడా ఓటమి..

హిందీ చిత్ర పరిశ్రమలోకి మకాం మార్చిన రకుల్ ప్రీత్ సింగ్.. యారియాన్ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ రాలేదు. తర్వాత అనేక హిందీ చిత్రాలతోపాటు సౌత్ సినిమాల్లో కూడా అలరించింది ఈ ఫిట్ నెస్ సుందరి. బాలీవుడ్ లో కొంతకాలం సినిమాలు చేశాక మరోసారి కొండపొలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ కు జోడి కట్టింది ఈ భామ.

సినిమాలతో ఫుల్ బిజీ..

సినిమాలతో ఫుల్ బిజీ..

అయితే రకుల్ ప్రీత్ సింగ్ అనుకున్నంతగా కొండపొలం సినిమా విజయం సాధించలేదు. కొండపొలం హిట్ కాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ వైపు నడిచింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం హిందీలో చేతినిండా ఫుల్ సినిమాలతో యమ బిజీగా ఉంది ఈ కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే ఆమె నటించిన రన్​ వే 34, అటాక్​ పార్ట్ 1, థ్యాంక్ గాండ్, డాక్టర్ జీ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి.

కండోమ్ టెస్టర్ గా..

కండోమ్ టెస్టర్ గా..

అన్నింటికంటే అక్షయ్ కుమార్ తో చేసిన కట్ పుట్లి సినిమా నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ విడుదైల పర్వాలేదనిపించుకుంది. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ ఛత్రీవాలీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేరుగా ఓటీటీలో విడదలైన ఈ సినిమాలో ఎవ్వరూ చేయనటువంటి పాత్ర అయిన కండోమ్ టెస్టర్ గా రకుల్ ప్రీత్ అలరించింది. ఈ సినిమాను నేరుగా ప్రముఖ ఓటీటీ జీ5లో విడుదల చేశారు. జనవరి 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

అలాంటి డ్రెస్సులో..

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నిత్యం హాట్ షోతో యూత్ ను అట్రాక్ట్ చేస్తుంటుంది కూల్ బ్యూటి రకుల్. తాజాగా సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి హద్దు లేకుండా తన ఎద అందాలను ఆరబోసింది. ఈ ఫొటోల్లో వయ్యారంగా పోజులిచ్చిన ఈ ఫిట్ నెస్ సుందరి ఘాటుగా అందాలను ప్రదర్శించింది. దీంతో ఆమె అందాలు చూపరులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X