సెల్ఫీతో భయపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. గుర్తు పట్టని విధంగా.. షాకింగ్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే ఆ విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని ఒక సక్సెస్ వచ్చిన వెనువెంటనే వరుసగా డిజాస్టర్స్ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గత రెండేళ్లుగా ఎలాంటి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాయి. ఇక రెగ్యులర్ సినిమాలు చేయకుండా రకుల్ కాస్త కొత్తగా కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ఇక ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ సెల్ఫీతో అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గతంలో ఎన్నో హాట్ ఫోటోలతో సర్ ప్రైజ్ చేసిన ఈ బ్యూటీ ఈ సారి మాత్రం ఊహించని విధంగా అందరినీ షాక్ కి గురి చేసింది

మొదట్లో వరుస విజయాలు
2009లో గిల్లి అనే కన్నడ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో రెగ్యులర్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ హోదాను సెట్ చేసుకుంది. ఆ తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు అంతగా ఆడకపోయినప్పటికి కూడా ఈ బ్యూటీకి నాన్నకు ప్రేమతో, సరైనోడు సినిమా మంచి ఫలితాలను అంధించాయి. దృవ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో రకుల్ హోదా ఒక్కసారిగా పెరిగిపోయింది.

బాలీవుడ్ లో కూడా
రకుల్ బ్యాడ్ లక్ ఏమిటో గాని సక్సెస్ వచ్చిన వెంటనే ఆమెను అపజయాలు పలకరిస్తున్నాయి. స్పైడర్ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత లాభం లేదనుకుని బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ రెండు సినిమాలతో పరవాలేదు అనే విదంగా కమర్షియల్ సక్సెస్ లను అందుకుంది కానీ భారీ స్థాయిలో అయితే అవకాశాలను అందుకోలేకపోయింది.

మళ్ళీ ఎప్పటిలానే డిజాస్టర్స్
నాగార్జునతో చేసిన మన్మథుడు సినిమా మరో డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక నితిన్ తో చేసిన చెక్ సినిమా కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది. రకుల్ ప్రీత్ సింగ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి కాస్త భిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఏవి అంతగా సక్సెస్ అవ్వడం లేదు. ఆమె చెక్ సినిమా పై ఒక విధంగా భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ ఆ సినిమా ఊహించని ఫలితాన్నిచ్చింది.

సెల్ఫీతో భయపెట్టిన రకుల్
ఇక సినిమా ఫలితాల విషయాన్ని పక్కన పెడితే రకుల్ అప్పుడప్పుడు సరికొత్త ఫోటోలతో నెటిజన్లకు షాక్ ఇస్తోంది. రీసెంట్ గా ఆమె ఒక సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో రకుల్ మొహం చాలా చిన్నగా సన్నగా కనిపిస్తోంది. ఒకప్పుడు చబ్బీ చెంపలతో కనిపించిన రకుల్ ఇప్పుడు మాత్రం భయపెట్టే విధంగా మారిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Recommended Video

ఆశలన్నీ ఆ సినిమాపైనే..
ఇక ప్రస్తుతం తన ఆశలన్నీ కూడా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొండపొలం పైనే పెట్టుకుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రకుల్ ఓబులమ్మ అనే ఒక విలేజ్ అమ్మాయి గా కనిపించబోతోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని రకుల్ ధీమాగా ఉంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











