Rakul Preet Singh: మాల్దీవుల్లో రకుల్ అందాల రచ్చ.. బికినీలో హాట్ గా కూల్ బ్యూటి

తెలుగులో ఒకప్పుడు స్టార్​ హీరోయిన్​గా వరుస సినిమాలతో యూత్​ను అట్రాక్ట్​ చేసిన కూల్​ బ్యూటీ రకుల్​ ప్రీత్ సింగ్​ ప్రస్తుతం టాలీవుడ్ కు దూరంగా ఉంది. తెలుగు తెరకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్​లో మాత్రం జోరుగా హవా చూపిస్తోంది. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. కానీ ఆ సినిమాలు అనుకున్నంత హిట్ కావట్లేదు. అయినా ఛాన్స్ లు మాత్రం క్యూ కట్టడం ఆగట్లేదు. డిఫరెంట్ క్యారెక్టర్లతో విభిన్నమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందంతో ఊపేస్తోంది. వరుసగా హాట్ ఫొటోలతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఈ ఫిట్ నెస్ సుందరి తాజాగా వదిలిన ఫొటోలు క్రేజ్ ను సంతరించుకున్నాయి.

 ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ..

ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ..


టాలీవుడ్ లో కెరటం అనే చిన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పంజాబీ భామ రకుల్​ ప్రీత్ సింగ్​. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ తో హిట్ కొట్టింది. ఈ మూవీలో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా చేసింది. ఆ తర్వాత రఫ్​, లౌక్యం సినిమాల్లో చేసిన రకుల్​ అనంతరం కరెంట్​ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి తదితర సినిమాల్లో నటించి అగ్ర హీరోలతో జతకట్టింది.

గ్లామర్ తో, ఫిట్ నెస్ తో ఎంటర్టైన్..

గ్లామర్ తో, ఫిట్ నెస్ తో ఎంటర్టైన్..

అగ్ర హీరోలతో జతకట్టడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ క్యూట్ బ్యూటి. అయితే చాలాకాలంపాటు తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో, ఫిట్ నెస్ తో ఎంటర్టైన్ చేసిన కూల్ భామ బాలీవుడ్ కి మకాం మార్చింది. రకుల్ ప్రీత్ సింగ్ చివరిగా తెలుగులో కొండపొలం మూవీలో నటించింది. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన ఈ భామ జోడి కట్టింది. అయితే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతగా హిట్ కాలేదనే చెప్పాలి.

 నేరుగా ఓటీటీలోకి..

నేరుగా ఓటీటీలోకి..

ప్రస్తుతం హిందీలో చేతినిండా ఫుల్ సినిమాలతో యమ బిజీగా ఉంది ఈ కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే ఆమె నటించిన రన్​ వే 34, అటాక్​ విడుదలైన అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి. ఈ చిత్రాల తర్వాత బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కట్ పుట్లి సినిమాతో నేరుగా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఆమూవీ పర్వాలేదనిపించుకుంది.

 కమల్ హాసన్ తో జోడి..

కమల్ హాసన్ తో జోడి..


ఇక రకుల్ నటించిన మరో హిందీ చిత్రం థ్యాంక్ గాడ్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో జోడి కట్టింది ఈ ఫిట్ నెస్ సుందరి. అలాగే డాక్టర్​ జీ, ఛత్రీవాలీ వంటి సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం భారతీయుడు 2 చిత్రంలో కూడా రకుల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మరో హీరోయిన్ గా చందమామ కాజల్ అగర్వాల్ కూడా అలరించనుంది.

పర్సనల్ విషయాలను సైతం..

పర్సనల్ విషయాలను సైతం..

ఫిట్ నెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టవ్ గా ఉంటోంది. తన సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లతో పాటు పలు అప్డేట్స్ ఇస్తూ అభిమానులు, ప్రేక్షకులతో టచ్ లో ఉంటుంది. ఇటీవల మషూక అనే వీడియో ఆల్బమ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఆ పాటను తెలుగులోనూ డబ్ చేశారు. ఇలా కెరీర్ ముచ్చట్లతోపాటు పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకుంటుంది ఈ భామ.

 జళకాలాడుతున్న సాగర కన్యలా..

జళకాలాడుతున్న సాగర కన్యలా..


వర్కౌట్, ఫిట్ నెస్, డ్యాన్స్, అడ్వర్టైజింగ్ వీడియోస్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ తన హాట్ హాట్ అందాలను హద్దు లేకుండా సోషల్ మీడియాలో ఆరబోస్తుంది. ఇప్పటికే తన బక్కపలచని అందాలను ఆరబోసిన ఈ సుందరి తాజాగా మరికొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సముద్రం మధ్యలో జళకాలాడుతున్న సాగర కన్యలా దర్శనమిచ్చింది ఈ బ్యూటి. బికినీ ధరించిన ముద్దుగుమ్మ రకుల్ అందాలు నీలి సముద్రంలో అట్రాక్ట్ చేస్తున్నాయి.

వాటర్ బేబీ ఫర్ లైఫ్..

వాటర్ బేబీ ఫర్ లైఫ్..

నీళ్లలో ఆటలాడుతున్న ఈ ఫొటోకు వాటర్ బేబీ ఫర్ లైఫ్ అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అలాగే సముద్రం మధ్యలో కట్టిన నెట్ లో వయ్యారంగా పడుకుని పోజులిచ్చింది ఈ భామ. మరొక ఫొటోలో బికినీ ధరించిన రకుల్ తన థైస్ అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X