Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ వర్కౌట్ వీడియో.. ఘాటుగా అందాల ప్రదర్శన
ఒక్కప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా యూత్‌ను అట్రాక్ట్ చేసిన కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉంది. కానీ బాలీవుడ్లో మాత్రం జోరుగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. కానీ ఆ సినిమాలు మాత్రం వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. కానీ సోషల్ మీడియా వేదికగా రకుల్ ప్రీత్ సింగ్ పెట్టే ఫొటోలు, వీడియోలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. తన గ్లామర్‌తో నెట్టింట మెస్మరైజ్ చేస్తోంది ఈ ఫిట్నెస్ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటి తన ఫిట్ నెస్ కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. మరి ఆ వీడియో విశేషాలేంటో ఓ లుక్కేద్దామా!

కెరటం మూవీతో పరిచయం..
రకుల్ ప్రీత్ సింగ్ కెరటం అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత రఫ్, లౌక్యం సినిమాల్లో చేసిన రకుల్ అనంతరం కరెంట్ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి తదితర సినిమాల్లో నటించి అగ్ర హీరోలతో జతకట్టింది.

హిందీ సినిమాలతో ఫుల్ బిజీ..
ప్రస్తుతం బాలీవుడ్లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ కూల్ బ్యూటీ. ఇప్పటికే ఆమె నటించిన రన్ వే 34, అటాక్ విడుదలైన అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. అయినా రకుల్‌కు అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం డాక్టర్ జీ, ఛత్రీవాలీ, థ్యాంక్ గాడ్ వంటి బాలీవుడ్ సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

భారతీయుడు 2 చిత్రంలో..
అంతేకాకుండా భారతీయుడు 2 చిత్రంలో కూడా రకుల్ నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో చివరిగా కొండపొలం సినిమాలో నటించింది ఫిట్నెస్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్గా ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ హిందీ బాట పట్టింది రకుల్ ప్రీత్ సింగ్.

వరుసగా పలకరిస్తున్న ఫ్లాప్‌లు..
బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ జోరు మీద ఉన్న రకుల్ ప్రీత్ సింగ్‌కు వరుసగా ఫ్లాప్‌లు పలకరిస్తున్నాయి. అయినా తనపని తాను చేసుకుంటూ ముందుకు సాగిపోతోంది కూల్ బ్యూటీ. ఇక తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన హిందీ చిత్రం కట్ పుట్లీ. ఇటీవలే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్ వేదికగా విడుదలైంది.

గ్లామర్ ఫొటోలతో..
సెప్టెంబర్ 2న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ కట్ పుట్లీ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా డాక్టర్ జీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తన స్లిమ్ అందాలతో యూత్‌ను అట్రాక్ట్ చేస్తోంది ఈ పంజాబీ భామ. హాట్, గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేసే ఈ సుందరి తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసింది.
చాలా ఘాటుగా అందాలు..
ఓ ఫిట్ నెస్ ప్రొడక్ట్ ప్రమోషన్స్ లో భాగంగా వర్క్ అవుట్ వీడియో చేసింది ఈ హాట్ బ్యూటి. ఈ వీడియోలో రకుల్ ప్రీత్ సింగ్ ఎద అందాలు చాలా ఘాటుగా కనిపిస్తున్నాయి. ఆమె స్లిమ్ అందాలతో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాగా బాలీవుడ్ కు వెళ్లిన ఈ భామ ఫిట్ నెస్ ఫ్రీక్ గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











