twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rakul Preet Singh: ఆ హీరోకు మొత్తం లిప్స్ ఇచ్చేసిన రకుల్.. ఇలాంటి లిప్ లాక్ ఎక్కడైనా చూశారా?

    |

    గ్లామరస్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాలంలో తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. మొదట ఆమెకు స్టార్ హీరోయిన్ గా తెలుగులోనే స్టార్ గా గుర్తింపు వచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం హిందీ సినిమాలు గ్యాప్ లేకుండా చేస్తోంది. అయితే అప్పుడప్పుడు ఆమె ఊహించని పాత్రలలో కూడా కనిపిస్తోంది. రీసెంట్ గా ఒక యువ హీరోతో ఆమె లిప్ లాక్ సీన్లో నటించిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    డిఫరెంట్ సినిమాలు

    డిఫరెంట్ సినిమాలు

    బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన పాత్ర డిఫరెంట్ గా ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అయితే తెలుగులో ఆమెకు చాలా కాలంగా సక్సెస్ లు కూడా లేవు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే విభిన్నమైన పాత్రలలో కనిపించేందుకు సినిమాలు చేస్తోంది. ఇక రీసెంట్ గా ఆమె డాక్టర్ జి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    మంచి టాక్ రావడంతో..

    మంచి టాక్ రావడంతో..

    ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరపైకి వచ్చిన డాక్టర్ జి సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక విభిన్నమైన పాత్రలో కనిపించే ప్రయత్నం చేసింది. మొదట ఈ సినిమాను థియేట్రికల్ గానే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ తరువాత నేట్ ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ రావడంతో నిర్మాతలు ఓటీటీ ద్వారా విడుదల చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ట్రేండింగ్ లిస్టులో కూడా కొనసాగుతోంది.

    రకుల్ లిప్ లాక్ సీన్

    రకుల్ లిప్ లాక్ సీన్

    డాక్టర్ జి అనే సినిమా మెడికల్ క్యాంపస్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన కొద్ది నిమిషాలకే ట్రెండింగ్ లిస్టులోకి వచ్చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ లిప్ లాక్ సన్నివేశం అయితే ఊహించని విధంగా ఉంది.

    వీడియో వైరల్

    గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని లిప్ లాక్ సన్నివేశాలలో నటించింది. కానీ ఇందులో మాత్రం ఆమె మరింత ఘాటుగా లిప్ లాక్ సీన్లో కనిపించడం తెలుగువారికి అయితే కొంత షాక్ ఇచ్చింది. ఈ బ్యూటీ ఆయుష్మాన్ ఖురానా తో సాంగ్లో ఒక వైపు రొమాంటిక్ గా మరొకవైపు ఘాటుగా కనిపించింది. ఇక లిప్ లాక్ సన్నివేశంకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది.

    బాలీవుడ్ లో బిజీగా రకుల్

    బాలీవుడ్ లో బిజీగా రకుల్

    మొత్తానికి డాక్టర్ జి సినిమా అయితే ఓటీటీలో మంచి గుర్తింపును అందుకుంది. ఈ సినిమాలో రకుల్ కూడా ఒక డాక్టర్ పాత్రలోనే కనిపించింది. ఆమె కామెడీ టైమింగ్ కూడా బాగానే అనిపించింది అని ప్రశంసలు అందుకుంటోంది. ఇక రొమాంటిక్ సన్నివేశంలో కూడా రకుల్ కనిపించిన విధానం ఓ వర్గం వారికి అయితే షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంటున్న రకుల్ కు ఈ సినిమా కొంత క్రేజ్ అందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ చేతిలో అయితే ఇండియన్ 2 సినిమాతో పాటు మరో మూడు బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి.

    English summary
    Rakul Preet Singh lip lock scene with Ayushmann Khurrana video viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X