ఆ ఆఫర్ నిజమైతే రకుల్ లక్కు మారినట్లే.. ఏమవుతుందో?

చిన్న సినిమాలతోనే హిట్స్ అందుకుంటూ ఆ తరువాత నెమ్మదిగా స్టార్ హీరోలతో ఛాన్సులు కొట్టేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఢిల్లీ బ్యూటీ లక్కెమిటో గాని పడితే వదలడం లేదు. పోతే తిరిగి చూడడం లేదు. కెరీర్ లో రెండు సార్లు డిజాస్టర్స్ కారణంగా అవకాశాలు లేక ఇబ్బంది పడిన రకుల్ మూడవసారి వచ్చిన డిజాస్టర్ తో మళ్ళీ కోలుకోవడం లేదు.

మన్మథుడు 2 సినిమా ఆమెపై తీవ్ర ప్రభావమే చూపినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి తెలుగులో పెద్ద హీరోలతో అవకాశాలు అందుకోలేదు. తెలుగులో హీరోయిన్స్ కొరత ఉన్నప్పటికీ అందరూ పూజా హెగ్డే, రష్మీక మందన్న వైపే చూశారు గాని వారితో సమానంగా గ్లామర్ విషయంలో క్రేజ్ అందుకున్న రకుల్ కి మాత్రం ఛాన్సులు రాలేవు.

Rakul preet singh next project with pawan kalyan

ఇక చాలా కాలం తరువాత టాలీవుడ్ లో రకుల్ కి ఒక మంచి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందనున్న విరూపాక్ష ప్రాజెక్టులో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా దర్శకుడు చాలా మంది హీరోయిన్స్ తో సంప్రదింపులు జరిపినప్పటికి ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదట. ప్రస్తుతం ఆ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఫైనల్ గా రకుల్ ప్రీత్ సింగ్ అయితే బావుంటుందని దర్శకుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం రకుల్ ఉన్న పరిస్థితులలో తెలుగులో ఒక మంచి అవకాశం దక్కితేనే కెరీర్ కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మరి అమ్మడి లక్కు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X