twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #మీటూ: లైంగిక వేధింపులకు, దానికి తేడా ఉంది... దుర్వినియోగం వద్దన్న రకుల్!

    |

    #మీటూ ఉద్యమం ఇండియా మొత్తాన్ని ఓ ఊపు ఊపుతోంది. ఈ ఉద్యమం కారణంగా సినీ పరిశ్రమలో పలువురు అవకాశాలు పొగొట్టుకోగా, రాజకీయ రంగంలో కొందరు పదవులు వదులుకున్నారు. పలువురు సెలబ్రిటీలు ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

    తాజాగా తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ #మీటూ ఉద్యమంపై స్పందించారు. #మీటూ ఉద్యమం ఇండియాలో బలోపేతం అవ్వడం సంతోషంగా ఉంది. కానీ లైంగిక కోరికలు తీర్చమని వేధించడం(సెక్సువల్ హరాస్మెంట్), అపోజిట్ జెండర్ పట్ల తప్పుగా ప్రవర్తించడం(సెక్సువల్ మిస్ కండక్ట్) పూర్తిగా భిన్నమైనవని రకుల్ ప్రీత్ అభిప్రాయ పడ్డారు.

    అన్నీ ఒకే రకమైనవి అంటే ఎలా?

    అన్నీ ఒకే రకమైనవి అంటే ఎలా?

    కొందరు సెక్స్ కోరిక తీర్చమని వేధించారని, కొందరు రేప్ చేశారని, కొందరు పడుకుంటేనే నీకు అవకాశాలు ఇస్తామన్నారని, కొందరు తమ పట్ల మిస్‌బిహేవ్ చేశారని.... రకరకాలుగా తమకు ఎదురైన అనుభవాలను మీటూ మూమెంటులో భాగంగా వెల్లడిస్తున్నారు. అయితే వీటన్నింటికీ ఒకేగాటిన కట్టేయడం సరికాదని రకుల్ ప్రీత్ అభిప్రాయ పడ్డారు.

    నేను అదృష్ట వంతురాలిని

    నేను అదృష్ట వంతురాలిని

    ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని అని చెప్పాలి. నా కెరీర్లో ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. కొందరి విషయంలో ఇలా జరిగాయని విన్నాను. అలాంటి వారు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం అభినందనీయం అని రకుల్ అన్నారు.

     దుర్వినియోగం చేయొద్దు

    దుర్వినియోగం చేయొద్దు

    #మీటూ ఉద్యమానికి ఇంత స్పందన రావడం సంతోషంగా ఉంది. అయితే ఎవరూ దీన్ని దుర్వినియోగం చేయరని భావిస్తున్నాను. అప్పుడే ఈ ఉద్యమం మీద నమ్మకం మరింత పెరుగుతుంది అని రకుల్ అభిప్రాయ పడ్డారు.

     రకుల్ ప్రీత్ సింగ్

    రకుల్ ప్రీత్ సింగ్

    రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో సూర్య ‘ఎన్జీకే'తో పాటు కార్తీ మూవీలో, శివ కార్తియేయన్ హరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు హిందీలో ‘దే దే ప్యార్ దే'లో నటిస్తున్నారు.

    English summary
    “A conversation of somebody forcing or somebody raping or somebody saying that ‘you will get the project only if you sleep with me’ and someone misbehaving are two different things. I feel that how we draw a line here and how we figure out what really happened and what didn’t happen, is something that we need to look into,” Rakul told IANS over the phone. Rakul continued: “I am very happy with the way the movement has gained momentum. These things have existed. I have been very lucky in my life that I haven’t faced it. But then you have heard of stories and I am glad that people are coming out and talking about it because it takes a lot of courage to do that.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X