twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విభజించి పాలించవద్దు.. అంతా డ్రామా... మోదీ ప్రభుత్వంపై రకుల్ కామెంట్స్

    |

    బాలీవుడ్‌లో దే దే ప్యార్ దే సినిమాతో హిట్ అందుకొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు దక్షిణాదిలో ఎన్‌జీకే చిత్రంపై గంపెడాశలు పెట్టుకొన్నది. సూర్య హీరోగా సెల్వరాఘవన్ రూపొందించిన ఈ చిత్రం మే 31న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రకుల్ ప్రమోషన్ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఏర్పడబోయే మోదీ ప్రభుత్వం, బీజేపీ విజయంపై రకుల్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..

     నాకు రాజకీయాలంటే ఆసక్తి..

    నాకు రాజకీయాలంటే ఆసక్తి..

    రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదు. కానీ దేశ రాజకీయాల్లో ఏం జరుగుతున్నదనే అంశాలపై దృష్టి పెడుతాను. తాజా పాలిటిక్స్ చూస్తే చాలా బాధగా ఉంది. రాజకీయాల్లో విపరీతమైన డ్రామ్ కనిస్తుంటుంది. టీవీ రేటింగ్‌ల కోసం పెద్ద ఎత్తున నేతలు ఫైట్ చేస్తూ కనిపిస్తుంటారు. నేటితరం పాలిటిక్స్ టీవీ సీరియల్స్‌ను మించేలా కనిపిస్తున్నాయి అని రకుల్ పేర్కొన్నారు.

    విభజించి పాలించే విధానం ఆపండి

    విభజించి పాలించే విధానం ఆపండి

    బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై సెన్సేషనల్ కామెంట్స్ రకుల్ చేయడం రాజకీయాల్లో చర్చకు దారి తీస్తున్నది. విభజించి పాలించే విధానాన్ని బీజేపీ మానుకోవాలి. దేశమంతా ఒక్కటే అనే భావన కల్పించాలి. ప్రతీ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రకుల్ అన్నారు.

     రాజకీయాలు నాకు సూట్ కావు

    రాజకీయాలు నాకు సూట్ కావు

    రాజకీయాలంటే నాకు అమితమైన ఆసక్తి ఉందనే విషయం నా ఫ్రెండ్స్ చెబితే తెలుస్తుంటుంది. నేటి తరం రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. కానీ నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను. నాది ముక్కుసూటిగా వ్యవహరించే మనస్తత్వం, అందుకే అవి నాకు అవి సరిపడవు. ఏదైనా మార్పు తీసుకురావాలంటే నేను వ్యక్తిగతంగా వాటి కోసం కృషి చేస్తాను అని రకుల్ పేర్కొన్నారు.

    నాగ్‌తో మన్మథుడు2‌లో

    నాగ్‌తో మన్మథుడు2‌లో

    బాలీవుడ్‌లో దే దే ప్యార్ దే తర్వాత, నాగార్జునతో కలిసి మన్మథుడు 2 సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కాగా, సూర్య, సాయి పల్లవితో కలిసి ఎన్‌జీకేలో నటిస్తున్నది. ఈ సినిమా మే 31న రిలీజ్ కానున్నది. ఈ సినిమా సక్సెస్‌పై భారీగా రకుల్ దృష్టిపెట్టింది.

    English summary
    Rakul Preet Singh is busy with NGK movie promotions. In this promotions, She also opened up about her expectations from BJP-led NDA (National Democratic Alliance) government. " Stop a divide and rule campaigning. The entire country is together and every state should get what they deserve and grow
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X