నా కారెక్టర్ దెబ్బ తీస్తే సహించను.. మితిమీరి ప్రవర్తిస్తే.. ‘మన్మథుడు2’ అత్యుత్సాహమే.. రకుల్
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ అన్నిభాషల్లోనూ హంగామా చేస్తున్నది. తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దడదడలాడిస్తున్నది. తాజాగా ఆమె నటించిన దే దే ప్యార్ దే చిత్రం విడుదలై రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువైంది. అలాగే తమిళ హీరో సూర్యతో కలిసి నటించిన NGK చిత్రం మే 31న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తన కెరీర్ గురించి, ఇటీవల కాలంలో ఎదురైన పరిస్థితుల గురించి ఆమె వివరణ ఇచ్చారు. రకుల్ చెప్పిన విషయాలు ఇవే..

మితీ మీరి ప్రవర్తిస్తే సహించను
సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగానే వస్తున్నాయి. కొన్నిసార్లు మితిమీరి ప్రవర్తిస్తే నేను స్పందించాల్సి వస్తుంది. ఇటీవల రెండు, ముూడు సంఘటనలు వివాదంగా కూడా మారాయి. అందుకే నా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు పట్టించుకోనంత వరకు నేను వాటిపై స్పందించకూడదని అనుకొన్నాను. కానీ నా క్యారెక్టర్‌ను దెబ్బ తీసే విధంగా ఉంటే సహించను. నన్ను బాధపట్టే వారికి తగిన గుణపాఠం చెబుతాను అని రకుల్ అన్నారు.

మన్మథుడు 2లో నాగ్ సరసన
టాలీవుడ్ హీరో నాగార్జునతో కలిసి మన్మథుడులో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పోర్చుగల్‌లో షూటింగ్ బ్రహ్మండంగా జరిగింది. ఆ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడటం అత్యుత్సాహం అవుతుంది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు చేసిన అన్నీ పాత్రల్లో ఇదే బెస్ట్ అవుతుందని నేను నమ్ముతాను. నాకు బాగా నచ్చిన పాత్ర అవుతుంది అని రకుల్ చెప్పారు.

బాలీవుడ్‌లో తొలి విజయంపై
బాలీవుడ్‌లో నాకు మొదటి విజయం లభించడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదలైన దే దే ప్యార్ దే చిత్రం మంచి వసూళ్లను రాబట్టుతున్నది. దే దే ప్యార్ దే నాకు బాగా సంతృప్తిని కలిగించిన చిత్రమని చెప్పగలను. నా ఫెర్ఫార్మెన్స్ ప్రతీ ఒక్కరు ప్రశంసించారు. నటిగా నాకు గొప్ప అనుభూతిని కలిగింది అని రకుల్ అభిప్రాయపడ్డారు.

సక్సెస్‌కు పొంగిపోను.. కుంగిపోను
నేను సక్సెస్‌కు పొంగిపోను.. ఫెయిల్యూర్స్‌కు కుంగిపోను. ఒకవేళ సినిమా ఆడితే అది టీమ్ ఘనతగా భావిస్తాను. ఫెయిల్ అయితే చేతులు ముడుచుకొని కూర్చొను. తర్వాత ఏమిటనే దాని గురించి ఆలోచిస్తాను. సినిమా ఆడకపోయినప్పుడు కూడా కొన్నిసార్లు హ్యాపీగా ఉన్నాను. సినిమా స్క్రిప్టు బాగుండి.. అది ఆడుతుందనుకుంటే ఆ సినిమాను అంగీకరిస్తాను అని రకుల్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











