ఆ తప్పుతో కెరీర్ క్లోజ్.. అందుకే టాలీవుడ్‌కు దూ‌రం?

అందాల భామ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (Rakul Preet Singh)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు 'కెరటం' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తొలి మూవీలో తన నటనతో మెప్పించిన ఈ అమ్మడు తెలుగులో దాదాపు హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే.. ఓ స్టార్ హీరో సినిమా వల్ల తన కెరీర్‌ ఎఫెక్ట్ అయిందనీ, అందుకే టాలీవుడ్ కు దూరమయ్యాననీ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ సినిమా ఏంటీ?

టాలీవుడ్‌లో రకుల్ తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'లక్యం', 'సరైనోడు', 'నాన్నకు ప్రేమతో', 'ధ్రువ' వంటి వరుస సక్సెస్‌లతో క్రేజ్ సంపాదించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలతో చేసిన సినిమాలు రకుల్‌ను టాప్ రేంజ్‌లోకి తీసుకెళ్లాయి. ఈ విజయాలే ఆమెను "లక్కీ చామ్"గా నిలబెట్టాయి. ప్రేక్షకులు, నిర్మాతలు కూడ ఆమెను సక్సెస్ హీరోయిన్‌గా చూడటం ప్రారంభించారు.

Rakul Preet Singh Opens Up How Mahesh Babu s Spyder Changed Her Career Path

టాలీవుడ్‌లో ఇలా వరుస విజయాలతో ఎదిగిన స్టార్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అతిపెద్ద షాక్ గురించి మొదటిసారి బహిరంగంగా మాట్లాడింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'స్పైడర్' సినిమా ఫెయిల్యూర్ కారణంగానే టాలీవుడ్ నుంచి తాను దూరమయ్యానని చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

మహేష్ బాబు - ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ సినిమా 'స్పైడర్'. ఈ మూవీలో రకుల్ హీరోయిన్ గా నటించింది. సుమారు ₹120 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైనా, బాక్సాఫీస్ వద్ద ఊహించని పరాజయం చవిచూసింది. మిక్స్‌డ్ రివ్యూల్, పేలవమైన వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా సినిమా కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోవడంతో, నిర్మాతలు భారీ నష్టాలు మూటగట్టుకున్నారు. ఈ ఫెయిల్యూర్ వల్ల రకుల్‌కు అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయని ఆమె వెల్లడించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. ' టాలీవుడ్ లో నాకు వరుసగా ఎనిమిది, తొమ్మిది సినిమాలు హిట్స్. 'స్పైడర్' నా కెరీర్‌లో మొదటి పెద్ద డిజాస్టర్. ఆ ఒత్తిడిని నేను మానసికంగా తట్టుకోలేకపోయాను. అందుకే టాలీవుడ్ నుంచి దూరమయ్యాను." ఈ సినిమా తర్వాత వచ్చిన అవకాశాలను కూడా తాను స్వయంగా తిరస్కరించినట్లు తెలిపింది. ఇండస్ట్రీలో పెరిగిన నెగెటివ్ ఎనర్జీ, సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు తనను బాగా దెబ్బతీశాయని చెప్పింది.

'స్పైడర్' తర్వాత రకుల్ కెరీర్ దిశ మళ్లిపోయింది. తెలుగు సినిమాల కంటే బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఆమె, వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగింది. అయ్యారీ, దేవ, డే డే ప్యార్ డే, థ్యాంక్ గాడ్, ఛత్రీవాలీ వంటి సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. టాలీవుడ్ నుంచి దూరంగా ఉన్నా, పాన్ ఇండియా బ్రాండ్లతో అసోసియేషన్, వరుస డిజిటల్ ప్రాజెక్టులతో ఆమె కెరీర్ ను బిజీ బిజీగా కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరలవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X