నాని సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఐటమ్ సాంగ్!
నేచురల్ స్టార్ నాని, క్రేజీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో భారీ చిత్రానికి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ చిత్రాన్ని ప్రారంభించారు. జెర్సీ తర్వాత నాని నటించబోతున్న చిత్రం ఇదే. మైత్రి మూవీస్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. పూజ కార్యక్రమాలతో సోమవారం ఉందయం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కీలక పాత్రలో నటించబోతున్నాడు.
దర్శకుడు విక్రమ్ కుమార్ నానిని వైవిధ్యమైన పాత్రలో చూపించబోతున్న ఈ చిత్రం గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఐటమ్ సాంగ్ లో నానితో కలసి స్టెప్పులేయబోతోందట. రకుల్ ప్రీత్ సింగ్ ఇంతవరకు ఐటమ్ సాంగ్స్ లో నటించింది లేదు. గతంలో చాలా సార్లు రకుల్ ప్రీత్ కు ఇలాంటి ఆఫర్స్ వచ్చినా రకుల్ అంగీకరించలేదు. అలాంటిది నాని చిత్రం కోసం అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు నాని జెర్సీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది. విక్రమ్ కుమార్ దర్శత్వంలో తెరకెక్కే చిత్రంలో నాని సరసన 5 గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











