For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Flop Actress in 2022 హిట్టు కొట్టని టాప్ హీరోయిన్లు ఎవరో తెలుసా? దారుణంగా డిజాస్టర్లతో!

  |

  సినిమాలకు గ్లామర్ అద్దేది ఎవరంటే.. టక్కున చెప్పేది హీరోయిన్స్ అనే. తమ అందం, చందం, అభినయం, ఆటా, పాటలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు. గ్లామర్ పాత్రలే కాకుండా కేవలం ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేసే హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇక సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ స్టార్స్ గా దూసుకుపోతున్నారు. కేవలం సౌత్ తో పరిమితం కాకుండా నార్త్ లోను తమ సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలు ఈ ఏడాది ఏమాత్రం ఫలించలేదు. ఈ 2022 సంవత్సరంలో ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందులో ఓ ఒక్కటి కూడా హిట్ కాకపోవడంతో నిరాశలో ఉన్నారు ఈ హీరోయిన్స్.

  ఏమాత్రం తగ్గేదే లే..

  ఏమాత్రం తగ్గేదే లే..

  తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్ గా యూత్​ను అట్రాక్ట్​ చేసిన కూల్​ బ్యూటీ రకుల్​ ప్రీత్ సింగ్​. ఒకప్పుడు టాలీవుడ్ లో తన అందచందాలతో గ్లామర్ షో చేసి ఆకట్టుకున్న ఈ పంజాబీ భామ ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. కానీ ఆ సినిమాలు అనుకున్నంత సక్సెస్ కావట్లేదు. అయినా అవకాశాలు ఏమాత్రం తగ్గేదే లే అంటున్నాయి. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తన గ్లామర్ తో నార్త్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన మోస్తారు విజయాన్ని కూడా అందుకోలేకపోయింది ఈ ఫిట్ నెస్ సుందరి.

  స్టార్ హీరోలతో నటించిన కూడా..

  స్టార్ హీరోలతో నటించిన కూడా..

  జాన్ అబ్రహం హీరోగా నటించిన అటాక్ పార్ట్ 1 చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ సైంటిస్ట్ గా నటించింది. ఏప్రిల్ 1న విడుదలైన ఈ మూవీ తీవ్ర పరాజయం పాలైంది. తర్వాత అదే నెలలో ఏప్రిల్ 29న రకుల్ ప్రీత్ సింగ్ కోపైలట్ గా నటించిన మరో మూవీ రన్ వే 34. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి స్టార్ యాక్టర్స్ తో రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. అనంతరం బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి కట్ పుట్లి సినిమాతో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

   ఓటీటీలో విడుదలైన కట్ పుట్లి..

  ఓటీటీలో విడుదలైన కట్ పుట్లి..

  క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కట్ పుట్లి సినిమా నేరుగా డిస్లీ ప్లస్ హాట్ స్టార్ లో విడదలైంది. కానీ ఈ సినిమా కూడా అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. ఈ చిత్రాల తర్వాత మరోసారి అజయ్ దేవగణ్ తో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చిత్రం థ్యాంక్ గాడ్. ఈ సినిమాలో మరో హీరోగా సిద్ధార్థ్ రాయ్ కపూర్, హాట్ భామ నోరా ఫతేహీ కూడా కనువిందు చేశారు. అక్టోబర్ 25న విడుదలైన ఈ మూవీ కూడా ఓటమినే చవిచూసింది.

  ఛత్రీవాలిపైన రకుల్ ఆశలు..

  ఈ సంవత్సరం రకుల్ ప్రీత్ సింగ్ ఐదో చిత్రంగా వచ్చింది డాక్టర్ జీ. ఆయుష్ ఖురానా, షెఫాలి షాతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఐదింటికి ఐదు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఆశలన్నీ ఛత్రీవాలిపైనే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ బ్యూటి కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం భారతీయుడు 2లో కూడా కనువిందు చేయనుంది. మరి చూడాలి ఈ సినిమాలు రకుల్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో.

  వరుసగా 3 చిత్రాలు ఫ్లాప్..

  వరుసగా 3 చిత్రాలు ఫ్లాప్..


  రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత మరో స్టార్ హీరోయిన్ అయిన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నిలిచింది. ఈ 2022వ సంవత్సరం పూజా హెగ్డే నటించిన మూడు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అందులో మొదటిగా ఎన్నో అంచనాలతో విడుదలైన రాధేశ్యామ్ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. అనంతరం ఏప్రిల్ నెలలో వరుసగా ఆచార్య, బీస్ట్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది బుట్టబొమ్మ.

  సర్కస్ సినిమాతో..

  సర్కస్ సినిమాతో..

  బాక్సాఫీస్ వద్ద ఆచార్య, విజయ్ బీస్ట్ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే F3 సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది ఈ బ్యూటి. ఈ మూవీ కూడా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీలో సర్కస్ అనే సినిమాతో ఇదే నెలలో 23న ప్రేక్షకుల ముందుకు రానుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇక వీళ్లిద్దరి తర్వాత మూడు సినిమాల పరాజయంతో నిలిచిన మరో బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి సనన్.

  3 చిత్రాలకు డిజాస్టర్ టాక్..

  వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటి కృతి సనన్.. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీతగా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఈ ఏడాది కృతి సనన్ నటించిన హమ్ దో హమారే దో (ఓటీటీ), బచ్చన్ పాండే, భేడియా చిత్రాలు వరుసగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇలా ఏ ఏడాది చేసిన ప్రతి సినిమా పరాజయంతో ఫ్లాప్ హీరోయిన్స్ గా రికార్డుకెక్కారు ఈ ముద్దుగుమ్మలు.

  English summary
  Star Heroines Rakul Preet Singh Pooja Hegde Kriti Sanon Were Biggest Flop Actress In 2022
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X