10 ఏళ్లకే ఆ గేమ్‌లో ఛాంపియన్.. ఆ ఒక్క కారణంతో ఆటకు గుడ్‌బై చెప్పిన స్టార్ హీరోయిన్!
దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి రకుల్ ప్రీతి సింగ్ (Rakul Preet Singh). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అగ్రహీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గ్లామర్, ఫిట్‌నెస్, నటనతో పాటు క్రమశిక్షణకు కూడా రకుల్ పేరు ఉంది. అయితే తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె నటిగా కెరీర్ ప్రారంభించకముందు జాతీయ స్థాయిలో గోల్ఫ్ కీడ్రాకారిణీ అంట, కానీ ఓ ఒక్క కారణంతో ఆ ఆటను వదిలేశానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏ ఆ కారణమేంటీ?
హీరోయిన్ రకుల్.. 'పతి పత్నీ ఔర్ వో దో' (Pati Patni Aur Woh do) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన చిన్ననాటి కలలు, మోడలింగ్ జర్నీ, చదువు, గోల్ఫ్ కెరీర్, సినిమా అవకాశాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సమయంలో రకుల్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే తనకు మోడలింగ్ అంటే ఇష్టమని చెప్పింది. ముఖ్యంగా 1994లో ఐశ్వర్య రాయ్ మిస్ ఇండియాగా నిలిచిన తర్వాత ఆ రంగంపై మరింత ఆసక్తి పెరిగిందని తెలిపింది.

"మిస్ ఇండియా పోటీలను చాలా ఆసక్తిగా చూసేదాన్ని. ఒకసారి అయినా మోడలింగ్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఇంట్లో చెప్పగా.. 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఆలోచించమన్నారు. ఆ వయసు వచ్చిన వెంటనే ఫొటోషూట్ చేయించుకుని ఢిల్లీలో మోడలింగ్ మొదలుపెట్టాను" అని చెప్పింది. మోడలింగ్ చేస్తున్న రోజుల్లోనే ఒక కన్నడ సినిమా ఆఫర్ వచ్చిందని రకుల్ గుర్తుచేసుకుంది. అయితే అప్పట్లో దక్షిణాది సినీ పరిశ్రమ గురించి పెద్దగా తెలియదని తెలిపింది.
రకూల్ ఇంకా మాట్లాడుతూ.. "నేను ఢిల్లీలో పెరిగాను. మా ఫ్యామిలీ ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్. అప్పట్లో ప్రాంతీయ సినిమాల గురించి అంతగా తెలియదు. అందుకే నేను హిందీ సినిమాలే చేస్తానని చెప్పాను. సౌత్ మూవీస్ చేయను అన్నాను" అని చెప్పిందట. అయితే.. తర్వాత నిర్మాతలు తన తండ్రితో మాట్లాడారని, మంచి హీరోయిన్ అవుతుందని చెప్పారని తెలిపింది. "లక్షల్లో రెమ్యునరేషన్ వస్తుందని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ డబ్బుతో కారు కొనాలి అనిపించింది. కానీ చదువు మానేయడం ఇష్టం లేక, ముందుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాతే ముంబై వెళ్లాను" అని వివరించింది.
10 ఏళ్లకే గోల్ఫ్ ప్రారంభం
రకుల్ ఇంటర్వ్యూలో చెప్పిన మరో ఆసక్తికర విషయం గోల్ఫ్ గురించి. తాను 10 ఏళ్ల వయసులోనే గోల్ఫ్ ఆడటం మొదలుపెట్టానని తెలిపింది. "హైస్కూల్ చదివే సమయానికి జూనియర్ నేషనల్ లెవల్ పోటీల్లో కూడా ఆడాను. గోల్ఫ్‌లో మంచి భవిష్యత్తు ఉండేది. కానీ కెమెరా ముందు మెరవాలనిపించింది" అని చెప్పింది. అయితే గోల్ఫ్ మానేయడానికి ప్రధాన కారణం తన స్కిన్ టోన్ మారడం అని రకుల్ స్పష్టం చేసింది. "బయట ఎక్కువసేపు ఆడటం వల్ల నేను చాలా ట్యాన్ అయ్యాను. నా రంగు మారిపోతోంది. నాకు మోడలింగ్, నటనపై ఆసక్తి ఉంది. అందుకే ప్రొఫెషనల్ గోల్ఫ్‌ను కొనసాగించలేదు" అని తెలిపింది. అయితే ఇప్పటికీ సరదాగా అప్పుడప్పుడూ గోల్ఫ్ ఆడుతూనే ఉంటానని చెప్పింది.
రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. కొందరు "కెరీర్ కోసం స్పోర్ట్స్ వదిలేయడం పెద్ద నిర్ణయం" అంటుండగా, మరికొందరు "రంగు మారిపోతుందనే కారణంతో గోల్ఫ్ మానేయడం బాధాకరం" అంటున్నారు. ఇక పెళ్లి తర్వాత రకుల్ సెలెక్టివ్ ప్రాజెక్టులపైనే దృష్టి పెడుతోంది.
ముఖ్యంగా హిందీ చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఫిట్‌నెస్, బిజినెస్, సినిమాలతో సమతౌల్యం పాటిస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. ఇలా ఫైనల్ గా 10 ఏళ్లకే జాతీయ స్థాయి గోల్ఫ్ ఆడిన అమ్మాయి.. తర్వాత మోడలింగ్ నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన జర్నీ ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ జీవితంలో గోల్ఫ్ నుంచి గ్లామర్ వరకూ సాగిన ప్రయాణం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications