ఆ సీన్లలో నటించడానికి రెడీ.. అలాంటి కండిషన్..రకుల్ ప్రీత్ సింగ్
తాజాగా పెళ్లయిన రకుల్ ప్రీత్ సింగ్ ఓ లిప్ లాక్ సీన్ లో నటించేందుకు సిద్ధమని చెప్పి షాక్ ఇచ్చింది. కానీ నిర్మాతలకు ఓ కండిషన్ మాత్రం పెట్టింది. కానీ ఇప్పటిదాకా ఆమె బోల్డ్ సన్నివేశాల్లో ఎక్కువగా నటించలేదు. పైగా కిస్ సీన్స్ కు దూరంగా ఉంటూ వచ్చింది. అలాంటిది పెళ్లయ్యాక ఏకంగా కిస్ సీన్స్ కు ఓకే చెప్పడం, పైగా దానికి కండిషన్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. మరి రకుల్ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయానికి కారణం ఏంటి? ఆమె కండిషన్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
సౌత్ సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించి భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి నార్త్ కి షిఫ్ట్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ముంబైకి షిఫ్ట్ అయ్యాక ట్రెండ్ మార్చేసింది. ఫోటో షూట్‌లతో గ్లామర్ షో, ఎక్స్‌పోజ్ చేస్తోంది.

సినిమా అవకాశాలు లేకపోయినా వెబ్ సిరీస్ లు, కమర్షియల్ యాడ్ ఫోటోషూట్ లతో రకుల్ బిజీగా ఉంది. మరి ఈ నటి మళ్లీ టాలీవుడ్‌లో ఎప్పుడు అడుగు పెడుతుందో చూడాలి. తెలుగులో ఆమె చివరి చిత్రం కొండపొలం. కాగా ఈ ఏడాదే రకుల్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ గోవా బీచ్ సమీపంలో పెళ్లి చేసుకున్నారు. చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2024 ఫిబ్రవరి 21న గోవాలో ఉదయం సిక్కు సంప్రదాయంలో, సాయంత్రం సింధీ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు.
కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2021లో జాకీ భగ్నాని రకుల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. అప్పుడే సోషల్ మీడియాలో వీరి బంధం అధికారికంగా వెల్లడైంది. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి చాలా ఫంక్షన్లు, డిన్నర్లు, పార్టీల్లో దర్శనమిచ్చి చివరకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

కానీ పెళ్లయ్యాక కొన్ని నెలలు పూర్తిగా పర్సనల్ లైఫ్ కే కేటాయించింది. ఈ టైమ్ లోనే ఆమె భర్త జాకీ నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ 250 కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్టు వచ్చిన వార్త దుమారం రేపింది. ఆస్తులు అమ్మి జాకీ తండ్రి ఆ అప్పులు తీర్చేశాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే రకుల్ మళ్ళీ సినిమాలలో బిజీ కావడానికి సిద్ధం అవుతోంది. జూలై 12 న రిలీజ్ కాబోతున్న రకుల్ కమల్ హాసన్ 'ఇండియన్ 2'తో రకుల్ ప్రేక్షకులను పలకరించబోతోంది.
ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇండియన్ 2 ప్రమోషన్‌లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్‌కు విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. రకుల్ ప్రీత్ సింగ్ ని లిప్ లాక్ సీన్ లో నటించమని అడిగితే నటిస్తుందా? అని అడిగిన ప్రశ్నకు నటి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రకుల్ స్పందిస్తూ "కథను బట్టి ఉంటుంది. ఇంతకుముందు కూడా బోల్డ్ రోల్ చేశాను. కథకు అవసరమైతే కిస్ సీన్ చేస్తాను. లిప్ లాక్ సీన్ ని పబ్లిసిటీకి వాడుకుంటే మాత్రం నటించను" అంటూ చెప్పింది.


Click it and Unblock the Notifications











