రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే అంటున్న రకుల్ ప్రీత్ సింగ్?
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు సైన్ చేస్తూ దూసుకెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ జోరుకు 'స్పైడర్' ప్లాప్‌తో బ్రేక్ పడింది. 2017లో ఈ సినిమా విడుదలవ్వగా ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపిక అవ్వలేదు. దీంతో హిందీ, తమిళ ఇండస్ట్రీలపై దృష్టిపెట్టి ఆ సినిమాలే ఎక్కువగా చేస్తూ వచ్చారు రకుల్.
ఎట్టకేలకు రకుల్ ప్రీత్ తెలుగు సినిమాకు కమిట్ అయింది. నాగార్జున హీరోగా రూపొందుతున్న 'మన్మధుడు 2' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఈ సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది.

రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన రకుల్
‘మన్మధుడు 2' సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సాధారణంగా రకుల్ ప్రీత్ సింగ్ తీసుకుంటున్న దానికంటే ఎక్కువ మొత్తమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Recommended Video


నిర్మాతలు ఓకే చెప్పారట
నాగార్జున లాంటి సీనియర్ హీరోకు సూటయ్యే సీనియర్ హీరోయిన్లు, అందులోనూ టాప్ 5లో ఉన్నవారు దొరకడం చాలా కష్టం. అందుకే ‘మన్మధుడు 2' నిర్మాతలు కూడా ఆమె అడిగినంత మొత్తం ఇవ్వడానికి ఒకే చెప్పారట.

మన్మధుడు 2
మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నాగార్జున అక్కినేని, జెమిని కిరణ్ సంయుక్తంగా `మన్మథుడు 2` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘చి.ల.సౌ' మూవీతో దర్శకుడిగా మారినరాహుల్ రవీంద్రన్ డైరక్షన్లో ఈ చిత్రం రూపొందుతోంది. మన్మథుడు` సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.
ముఖ్య నటులు, టెక్నీషియన్స్
కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి `RX100` ఫేమ్ చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











