Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వయసైపోయిన నాగార్జునతో రొమాన్స్ ... ఎన్ని కోట్లు ఇచ్చి ఒప్పించారంటే?
Recommended Video
వయసైపోయిన హీరోలతో యంగ్ హీరోయిన్లు చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. వారితో ఒకసారి సినిమా కమిటైతే యువ హీరోలతో తమకు అవకాశాలు రాకపోవచ్చని చాలా మంది భయపడతారు. అందులోనూ 60 ఏళ్లకు దగ్గరైన స్లార్లతో చేయడాన్ని తమ కెరీర్‌కు రిస్క్‌గా భావిస్తారు.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇలాంటి రిస్కులను ఏ మాత్రం కేర్ చేయడం లేదు. గతంలో నాగ చైతన్యతో కలిసి 'రారండోయ్ వేడుక చూద్దాం'లో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ... ఇపుడు చైతూ తండ్రి నాగార్జునతో 'మన్మధుడు-2'లో నటిస్తోంది. అయితే రకుల్‌ను ఒప్పించడానికి చిత్ర బృందం భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చిందట.
‘మన్మధుడు-2’ చిత్రానికి రకుల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం రకుల్ ప్రీత్ ‘మన్మధుడు-2' మూవీ కోసం రూ. 1.55 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. రకుల్ తన కెరీర్లో అందుకున్న అతిపెద్ద రెమ్యూనరేషన్లలో ఇదీ ఒకటి అనే టాక్ వినిపిస్తోంది.
ప్లాపుల్లో ఉన్న రకుల్‌కు ఇది భారీ రెమ్యూనరేషన్
ప్లాపుల్లో ఉన్న రకుల్‌కు ఇది భారీ రెమ్యూనరేషన్. ‘స్పైడర్' మూవీ ప్లాప్ అయిన తర్వాత ఆమెకు తెలుగులో హీరోయిన్గా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో కనీసం ఈ సినిమా ద్వారా అయినా టాలీవుడ్లో తన కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందనే ఆలోచనతో ఆమె ‘మన్మధుడు 2' చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
రకుల్‌తో ముద్దు సీన్లు ఉన్నాయా?
ఇటీవల విడుదలైన ‘మన్మధుడు 2' ట్రైలర్లో నాగార్జున పలువురు అమ్మాయిలతో లిప్ లాక్ ముద్దు సీన్లు చేస్తూ రెచ్చిపోవడం చూపించారు. అయితే రకుల్‌తో రొమాంటిక్ సీన్లు మాత్రం ట్రైలర్లో చూపించలేదు. మరి సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎలా వర్కౌట్ చేశాడు అనేది తెరపై చూడాల్సిందే.
మన్మధుడు 2
నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం మన్మథుడు 2. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. మన్మధుడిగా నాగార్జున ఈ చిత్రంలో తన రొమాంటిక్ విశ్వరూపం చూపించబోతున్నాడు.