నవంబర్ లోనే నా పెళ్లయిపోయింది.. అలా ఉంటేనే భద్రత.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్
కేవలం పాకెట్ మనీ కోసం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. గిల్లి అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఫిట్ నెస్ భామ తెలుగులో కెరటం మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. అనంతరం స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది. అదే క్రమంలో హిందీ చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంది. అయితే గత కొన్నేళ్లుగా హిందీ చిత్రపరిశ్రమలోనే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. సోషల్ మీడియా ద్వారా తప్పితే తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది లేదు. ఇక రకుల్ పై ప్రేమ, పెళ్లి వంటి వార్తలు తెగ వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించింది ఈ కూల్ బ్యూటి.

సినిమాలు చేస్తున్నప్పటికీ..
ఇంటర్ పూర్తి చేశాక ఏం చేద్దామనే ఆలోచన లేనప్పుడు కేవలం పాకెట్ మనీకోసం హీరోయిన్ గా నటించింది ఆర్మీ ఫ్యామిలీకి చెందిన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. గిల్లీ అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలో కాలు మోపిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ఫిట్ నెస్ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ అవి హిట్ మాత్రం కావడం లేదు.

అనేక తెలుగు సినిమాల్లో..
రకుల్ ప్రీత్ సింగ్ మొదటి తెలుగు సినిమా అయిన కెరటం హిట్ కాలేదు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీలో అవకాశం లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రంలో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టుకునేలా అలరిచింది. అనంతరం రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకీ నాయకా, స్పైడర్, ఖాకీ, ఎన్జీకే, చెక్, కొండపొలం వంటి తెలుగు సినిమాలు చేసింది.

హిందీ మాత్రమే కాకుండా..
తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న క్రమంలోనే హిందీ చిత్రపరిశ్రమ వైపుకు వెళ్లింది క్యూట్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్. యారియాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్.. అయ్యారే, దే దే ప్యార్ దే, రన్ వే 34, అటాక్ పార్ట్ 1, కట్ పుట్లీ, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ, ఛత్రీవాలీ వంటి సినిమాలు చేసింది. తెలుగు, హిందీ మాత్రమే కాకుండా తమిళంలోనూ అనేక సినిమాలు చేసి అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

రకుల్ సోదురుడు చెప్పినట్లు..
అయితే క్యూట్ భామ రకుల్ ప్రీత్ సింగ్.. నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. జాకీ నిర్మాతగా వ్యవరించిన మాషుకీ అనే వీడియో సాంగ్ ను వివిధ భాషల్లో గతేడాది విడుదల చేశారు. ఇక వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు మాత్రమే కాకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. గతేడాది నవంబర్ లో రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు అక్టోబర్ లో మొదటి సారి ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2023లో రకుల్ పెళ్లి చేసుకోబుతున్నట్లు ఆమె సోదరుడు అమన్ స్వయంగా వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.

పెళ్లి గురించి వెతకటం..
ఈ క్రమంలోనే నా వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాల గురించి తెలుసుకుంటున్న ఆఖరి వ్యక్తి అమన్ అని వెటకారంగా ట్వీట్ చేసింది రకుల్. తాజాగా ఈ పెళ్లి రూమర్స్ పై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది రకుల్ ప్రీత్ సింగ్. "గూగుల్ లో నా పేరు టైప్ చేస్తే అలర్ట్ లో వచ్చేస్తోంది. నేను పెళ్లి తేది గురించి ప్రత్యేకంగా సెర్చ్ చేయాల్సిన పని లేదు. ప్రతివారం నా మీద ఆర్టికల్స్ ఉంటాయి. వాటి ప్రకారం నేను గతేడాది నవంబర్ లోనే పెళ్లి చేసుకున్నాను. అయితే అది ఎలా జరిగిందో చెప్పడం లేదు" అని రకుల్ చెప్పుకొచ్చింది.

ఒకరిపై ఒకరికి..
"నిజానికి నేను తీసుకునే ఆహారం, అందులో ఉండే కేలరీల గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తాను. చాలా వరకు ఆహారం, కెలరీలు, ఆరోగ్యం గురించే నేను చదువుతాను. వంటలు అత్యంత చెత్తగా వండడం కూడా ఒక ప్రత్యేకమైన ప్రతిభ. అత్యంత చెత్త వంటకాలు ఎలా చేయాలో నేను శిక్షణ కూడా ఇవ్వగలను" అని తెలిపింది కూల్ బ్యూటి రకుల్. మరొక ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీతో రిలేషన్ గురించి ప్రస్తావిస్తూ "మేం ఎవరి దారిలో వాళ్లం చాలా బిజీగా ఉంటాం. అలా అని మేం చేసే పనుల గురించి ఎప్పుడూ చర్చించుకోం. నేను ఎప్పుడైనా కొన్ని విషయాల గురించి మాట్లాడుతుంటాను. రిలేషన్ షిప్ లో ఉన్న మాకు ఒకరిపై ఒకరికి ఎంతో గౌరవం ఉంది. దీని వల్ల భద్రత అనేది వస్తుంది" అని పేర్కొంది.


Click it and Unblock the Notifications











