‘పెళ్లికి ముందు ఆ పని చేయమని.. నేను బలవంతం చేశా’

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమించి పెళ్లి చేసుకొన్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత తన ఇమేజ్‌కు భిన్నంగా ఫ్యామిలీ లుక్‌తో వేష, భాషలు మార్చేసి పద్దతిగా కనిపిపస్తున్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి పలు విషయాలను వివరంగా వెల్లడించారు. రకుల్ ప్రీత్ సింగ్ తెలిపిన సమాచారం ప్రకారం..

మూడేళ్ల క్రితం మా డేటింగ్ మొదలైంది. మా ప్రేమ వ్యవహారంలో ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి. మా బంధంలో ఎలాంటి డిస్ట్రబెన్స్ లేదు. నేను, ఆయన చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకరికొకరు మా వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనిస్తూ కలిసి ఉండే ప్రయత్నం చేశాం. మేము సంతోషంగా ఉన్న సమయంలో రోజుకు 15 సార్లు ఫోన్ చేసుకొనే అవకాశమే కలుగలేదు అని రకుల్ ప్రతీ అన్నారు.

Rakul Preet Singh reveals How proposal was made before Marriage with Jackky Bhagnani

మా బంధంలో ఎలాంటి అనుమానాలు ఉండేవి కాదు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాదిరిగానే ఉండేవాళ్లం. మేమిద్దరం కలిసినప్పుడు మాత్రం ప్రపంచాన్ని మరిచపోయే వాళ్లం. మాతో పాటు ఫ్రెండ్స్ ఉండే వాళ్లు. ఎన్నో విషయాలు మా మధ్య చర్చకు వచ్చేవి. చాలా విషయాలు షేర్ చేసుకొనే వాళ్లం అని రకుల్ ప్రీత్ చెప్పారు.

మా మధ్య పరిచయం ప్రేమగా మారిందనే విషయం మాకు ఇద్దరికి అర్ధమైంది. అయితే నాకు ప్రపోజ్ చేసేలా అతడిని బలవంతం చేశాను. నీవు నాకు ప్రపోజ్ చేయకుంటే పెళ్లి చేసుకోను. నీవు నాకు ఎలా ప్రపోజ్ చేస్తావో నాకు తెలియదు. కానీ ఎలా ప్లాన్ చేస్తావో నీకే వదిలివేస్తున్నాను అంటూ రకుల్ ప్రీత్ తమ పెళ్లికి ముందు జరిగిన విషయాలు వెల్లడించింది.

Rakul Preet Singh reveals How proposal was made before Marriage with Jackky Bhagnani

అయితే మా పెళ్లికి ముందు ఓ పార్టీ జరిగింది. ఆ పార్టీని హీరోయిన్ భూమి పడ్నేకర్ ఏర్పాటు చేసింది. ఆ పార్టీలో జాకీ నాకు ప్రపోజ్ చేశాడు. ఆ పార్టీలో మాతోపాటు మరో 25 మంది ఉన్నారు. అలా నాకు జాకీ ప్రపోజ్ చేశాడు అని రకుల్ ప్రీత్ చెప్పింది. జాకీ, రకుల్ పెళ్లి గోవాలో అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మధ్య జరిగిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఆయలాన్ సినిమా సంక్రాంతికి రిలీజైంది. ఆమె నటించిన మేరీ పత్ని కా రీమేక్, ఇండియన్ 2 చిత్రం విడుదలకు సిద్దంగా ఉన్నాయి. పెళ్లి తర్వాత ఇంకా కొన్ని సినిమాలు ఒప్పుకోవాల్సి ఉంది. త్వరలోనే ఆమె నటించే సినిమాలు అధికారికంగా వెల్లడిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X