Don't Miss!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
కాబోయే భర్త గురించి చెప్పిన రకుల్ ప్రీత్... ఆ మూడు ఉంటే సరే
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ దూసుకెళ్తున్నది. హిందీలో ఆమె నటించిన దే దే ప్యార్ దే చిత్రం ఇటీవల విడుదలైంది. వైవాహిక బంధాలు, మానవ సంబంధాలు, వివాహేతర సంబంధాల ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. దే దే ప్యార్ దే చిత్రం మిశ్రమ స్పందనతో విజయం వైపు పరుగులు పెడుతున్నది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి గురించి ప్రస్తావించారు. తనకు కావాల్సిన వరుడు ఎలా ఉండాలనే విషయాన్ని వెల్లడించింది. రకుల్ నచ్చిన వరుడు ఎలా ఉండాలంటే..
నా భర్త ఇలా ఉండాలని
నాకు కాబోయే భర్తకు ప్రధానంగా మూడు రకాల లక్షణాలు ఉండాలి. అందులో మొదటిది అబ్బాయి కనీసం ఆరు అడుగులు ఉండి తీరాలి. నేను తల ఎత్తుకొని చూసేలా నా కాబోయే భర్త ఉండాలనేది నా కోరిక. అలాగే కాళ్లకు హీల్స్ ధరించినా.. అతను నాకంటే ఎక్కువ పొడుగు ఉండాలి. అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతాను అని రకుల్ వెల్లడించింది.
నా భర్తలో ఉండాల్సిన రెండో లక్షణం
నా కాబోయే భర్తలో ఉండాల్సిన రెండో క్వాలిటీ ఏమిటంటే... జీవితంలో ఏదో సాధించాలనే గొప్ప తపన ఉండాలి. జీవితానికి ఓ పరమార్థం ఉందని ఫీలవ్వాలి. ఎలాంటి ఉత్సాహం జోష్ లేని ఉద్యోగం చేసే వ్యక్తిగా ఉండకూడదు. లైఫ్ పట్ల ఒక విజన్ ఉండాలి. గొప్ప వ్యక్తి అయి ఉండాల్సిన అవసరం లేదు కానీ. అతని జీవితం కంటే గొప్పగా ఉండాలి అని రకుల్ రెండో నిబంధనను చెప్పింది.
నా భర్తకు ఉండాల్సిన మూడో లక్షణం
ఇక తనకు కాబోయే భర్త లైఫ్‌లో ఉండాల్సిన మూడో లక్షణం నిజాయితీగా, నికార్సుగా ఉండాలి. నా మాదిరిగా మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించాలి అని రకుల్ మూడో లక్షణాన్ని వెల్లడించింది. గత కొద్దికాలంగా నేను ఒంటరిగానే ఉంటున్నాను. లవ్ అఫైర్ లేకుండా ఇప్పటికే నేను సింగిల్‌గా ఉంటున్నాని జాతీయ మీడియాకు కూడా చెప్పాను. అన్నీ అర్హతలు ఉన్నా నేను ఇంకా సింగిల్‌గా ఎందుకు ఉన్నానో నాకే తెలియదు అని రకుల్ వెల్లడించింది.
రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్
కెరీర్ విషయానికి వస్తే, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన దే దే ప్యార్ దే చిత్రం విడుదలై రూ.50 కోట్ల వసూళ్లను సాధించింది. ఆమె నటించిన ఎన్జీకే చిత్రం మే 31న విడుదల కానున్నది. అలాగే నాగార్జునతో కలిసి నటిస్తున్న మన్మథుడు 2 చిత్రం ఆగస్టులో విడుదల కానున్నది. ఇంకా శివకార్తీయన్తో ఓ సినిమా. హిందీలో మార్జవాన్ సినిమాల్లో నటిస్తున్నది.