నితిన్ తదుపరి చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్!
యంగ్ హీరో నితిన్ త్వరలో వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రం జనవరిలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఖరారైంది. ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ ఏ చిత్రానికి అనే సందేహం రావచ్చు. వివరాల్లోకి వెళితే.. వెంకీ కుడుముల చిత్రం తరువాత నితిన్ నటించబోయే చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత రూపొందించ బోతున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.
బహుశా ఈ చిత్రం చంద్రశేఖర్ ఏలేటి దర్శత్వంలో ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ లో అవకాశాలు బాగా తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ నితిన్ చిత్రానికి సూచన ప్రాయంగా తన అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కాంబోలో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామలో అవకాశం దక్కించుకుంది.

కానీ ఈ చిత్రం ఎప్పుడు పార్రంభం అవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని రకుల్ ప్రీత్ భావిస్తోంది. స్పైడర్ చిత్రం తరువాత రకుల్ నుంచి తెలుగులో మరో చిత్రం రాలేదు. ప్రస్తుతం రకుల్ తమిళంలో మంచి అవకాశాలు అందుకుంటోంది. హీరో కార్తీ సరసన దేవ్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











