twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ ఫొటోలో ఉన్న పాప నేటి స్టార్ హీరోయిన్.. ఫుల్ ఫామ్‌లో ఉంది.. గుర్తుపట్టండి చూద్దాం!

    |

    చిన్ననాటి జ్ఞాపకాలంటే అందరికీ ముద్దే. బాల్యంలో దిగిన ఫొటోలు చూస్తే ఒక్కసారిగా మనసు ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ బాల్యాన్ని నెమరు వేసుకుంటూ తెగ మురిసిపోతుంటారు. ఇది అందరి లోనూ ఏదో ఒక సందర్భంలో చోటు చేసుకునే పరిణామమే. తాజాగా అలాంటి ఓ చిన్ననాటి జ్ఞాపకాన్ని షేర్ చేసింది నేటి స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె షేర్ చేసిన ఆ జ్ఞాపకం ఏమిటి? వివరాల్లోకి పోతే..

    చిన్ని గౌనుతో ముద్దొస్తున్న పాప

    చిన్ని గౌనుతో ముద్దొస్తున్న పాప

    ఓ చిన్ని గౌను వేసుకొని ముద్దొస్తున్న పాప ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాప చిన్నదే అయినా స్టైల్ పెద్దగానే ఉంది. ఈ ఫొటో కనిపిస్తున్న ఆ పాప.. తలపై కళ్లజోడును పైకి ఎత్తిపెట్టి సూపర్ ఫోజిచ్చింది. ఇంతకీ ఈ పాప ఎవరు అనే కదా! మీ సందేహం. ఆగండి.. అక్కడికే వస్తున్నాం.

    నేటి స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టండి చూద్దాం!

    చిన్ని గౌనుతో ముద్దొస్తున్న ఈ పాప నేటి స్టార్ హీరోయిన్. గుర్తు పట్టలేదా? అదేనండీ పంజాబీ బేబీ రకుల్ ప్రీత్ సింగ్. ఆమెనే స్వయంగా తన చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పైగా దీనిపై ''నేను ఇంకా పెద్దదాన్ని అయ్యానని అనుకోవడం లేదు'' అంటూ జబర్దస్త్ ట్యాగ్ చేసింది.

    నాడు అలా.. నేడు ఇలా

    నాడు అలా.. నేడు ఇలా

    ఈ పిక్ చూస్తుంటే రకుల్ ప్రీత్ చిన్నప్పటి నుంచే యమ పాష్ గర్ల్ అని తెలుస్తోంది. నాడు అలా ముద్దు ముద్దుగా ఉన్న ఈ బేబీ.. నేడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగి మరింతగా ముద్దొస్తోంది. వరుస సినిమాలు చేస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగు వెలుగుతోంది.

    మన్మథుడితో రొమాన్స్

    మన్మథుడితో రొమాన్స్

    ఇక రకుల్ ప్రీత్ సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన తాజా సినిమా మన్మథుడు 2. ఈ సినిమాలో నాగార్జున సరసన మోడ్రెన్ గర్ల్‌గా తెగ రొమాన్స్ చేసేసింది రకుల్. చిత్రంలో అవంతిక పాత్రలో రకుల్ అదరగొట్టేయనుందని టీజర్, ట్రైలర్ ద్వారా అర్థమైపోయింది.

    మన్మధుడు 2 మూవీ

    మన్మధుడు 2 మూవీ

    రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సర్వహంగులతో రూపొందింది 'మన్మథుడు 2' మూవీ. గతంలో నాగార్జున కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన మన్మథడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. చిత్రంలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించగా.. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 9న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Senior Hero Nagarjuna Manmadhudu 2 release date confirmed. This movie will release on August 9th. In this movie Rakul Preet Singh played a female lead with Nagarjuna. Now she shared her Childhood pic in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X