రకుల్‌ను వెంటాడుతున్న ఫెయిల్యూర్స్‌.. ముద్దుగుమ్మ ప్లాన్ బీ ఎంటో తెలుసా?

తెలుగు తెరపైకి ఎక్స్ ప్రెస్ వేగంతో దూసుకొచ్చిన ఢిల్లీ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి సినీ ప్రేమికులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరపై తన హాట్ ఫర్మామెన్స్ తో ప్రేక్షకులని పరేషాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ లోనే భారీ క్రేజ్ ను సంపాదించుకుని తారక్, చరణ్, మహేష్ వంటి సూపర్ స్టార్ల సరసన ఆడిపాడింది. రకుల్ పాప అందాలకు ఫిదా అయిన తెలుగు అభిమానులు ఆమెను స్టార్ హీరోయిన్ చేశారు. ఒకానొక సమయంలో రకుల్ బేబీకి వరుస హిట్లు పడటంతో నంబర్ 1 హీరోయిన్ అంటూ కాంప్లిమెట్స్ కూడా వచ్చాయి.

Rakul Preet Singh

అటువంటి సమయంలో రకుల్ బాలీవుడ్ మీద మనసు పారేసుకుంది. బీ టౌన్ కి మకాం మార్చేసింది. నార్త్ వాళ్లకు దగ్గర అవ్వటానికి లిప్ లాక్స్ పెట్టింది, బికినీ లో అందాలు ఆరబోసింది. కానీ అక్కడి ప్రేక్షకులని మెప్పించలేక పోయింది. రకుల్ కి ఆ టైంలో లక్ కూడా కలసి రాలేదనే చెప్పాలి. అనుకున్న స్థాయిలో అక్కడ సక్సస్ కాలేక పోయింది. ఇటు సౌత్ ప్రేక్షకులతో కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో కొత్త భామలు ఈ స్టార్ నాయిక ప్లేస్ ను ఆక్రమించేశారు. టాలీవుడ్ లో రకుల్ చివరి సినిమాలు ప్లాప్ అవ్వటం కూడా గ్యాప్ రావటానికి ఒక కారణం అయింది.

Rakul Preet Singh

దీంతో సౌత్ లో అవకాశాలు కూడా తగ్గాయి. రకుల్ తెలుగు సినీ అభిమానులను పలకరించి చాలా కాలమే అయింది. చాలా కాలం తర్వాత సౌత్ లో ఈ పొడవు కాళ్ల సుందరి జియో ఓటీటీ కోసం 'భూ'అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా రకుల్ ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొంది. అందులో తన కెరీర్ స్టార్టింగ్ గురించి, తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, ఇండ్రస్ట్రీలో తన్ ప్లాన్స్ గురించిన ఇంట్రస్టింగ్ విషయాలు గురించి పంచుకుంది.

Rakul Preet Singh

రకుల్ తన 20 ఏళ్ల వయసులో చిత్ర సీమలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిందట. మొదట్లో అవకాశాలు అంత సులభంగా లభించలేదట. కొంత కాలం అసలు ఇక్కడ తనకు కెరీర్ ఉంటుందా, ఉండదా అనే సందిగ్దంలో ఉండేదట. అప్పటికి తను మేథమేటిక్స్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిందని చెప్పింది. ఒక వేళ తనకు 2 ఇయర్స్ లో కనుక అవకాశాలు రాకపోతే మళ్లీ ఎడుకేషన్ వైపు వెళ్లి జాబ్ చేయాలని అనుకుందట. ఇదే తన ప్లాన్ బీ అని అభిమానులతో పంచుకుంది. రకుల్ నాన్న ఆర్మీ ఆఫీసర్ అవ్వటం వల్ల చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణతో పెరిగిందట. సినిమా అవకాశాలు రావటానికి ఈ క్రమశిక్షణ చాలా ఉపకరించిందని తెలిపింది.

Rakul Preet Singh

ప్రస్తుతం ఈ అమ్మడు శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా నటిస్తున్న 'ఇండియన్ 2'సినిమాలో సిద్ధార్థ్ కి జోడీగా కీలక పాత్రలో మెరవనుంది. ప్రస్తుతానికి ఇది ఒక్కటే రకుల్ సౌత్ లో చేస్తున్న సినిమా. దీనిపైనే రకుల్ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇది కూడా రోజుల ముందు కమిట్ అయిన సినిమా. పైగా కాజల్ ఇందులో ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల తర్వాత రకుల్ కెరీర్ ఎటువంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X