రిలేషన్‌లో మోసం చేస్తే అస్సలు క్షమించను... రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్రనటిగా దూసుకెళ్లిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లాడిన ఈమె.. భర్తతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిలేషన్‌పై రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం దాదాపుగా దక్షిణాదికి దూరమయ్యారు. పూర్తిగా బాలీవుడ్‌కే అంకితమయ్యారు ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఆమె నటించిన మూవీ పతీ పత్ని ఔర్ ఓ దో. ఆయుష్మాన్ ఖొరానా హీరోగా నటించగా సారా అలీఖాన్, వామికా గబ్బిలతో కలిసి రకుల్ ప్రీత్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బీఆర్ స్టూడియోస్‌ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా, కృషన్ కుమార్‌లు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ముదసర్ అజీజ్ దర్శకత్వ వహిస్తున్నారు. విజయ రాజ్, విశాల్ వశిష్ట, దుర్గేష్ కుమార్, దీపిక అమీన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రాఫర్‌గా, నినాద్ ఖాన్లోకర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా 8 మంది సంగీత దర్శకులు ఈ సినిమా కోసం పనిచేశారు. సమ్మర్ కానుకగా మే 15న పతీ పత్ని ఔర్ వో దో మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది.

Rakul Preet Singh s Relationship Comments Go Viral Actress Gives Immediate Clarification

ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ పాల్గొంటోంది. దీనిలో భాగంగా ఆయుష్మాన్ ఖొరానా, రకుల్, సారా అలీఖాన్‌లు ది బాంబే జర్నీ అనే యూట్యూబ్ ఛానెల్‌లో టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోసం, రిలేషన్‌షిప్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు రకుల్. రిలేషన్‌లో మోసం చేయడాన్ని తాను సమర్ధించనని చెప్పింది రకుల్. మోసం చేస్తే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని సారా చెప్పగా.. దానితో రకుల్ కూడా ఏకీభవించింది. అయితే పెళ్లయ్యాక మాత్రం కొన్ని కండీషన్స్ ఉంటాయని ఆయుష్మాన్ ఖొరానా అభిప్రాయపడ్డారు.

రిలేషన్‌లో ఏదైనా పొరపాటు జరిగితే .. దానికి నిజాయితీగా క్షమాపణ చెబితే వెంటనే క్షమించడం మంచి లక్షణం. మనమంతా మనుషులం.. చిన్న చిన్న పొరపాట్లు సహజం. అలాగని తప్పులు చేసుకుంటూ వెళ్లకూడదని ఆయుష్మాన్ అన్నాడు. అయితే ఒక్కసారి తప్పు చేస్తే క్షమించొచ్చా అని సారా అడగ్గా.. రకుల్ తొలుత ఓకే అని చెప్పింది. కానీ మోసం చేయడమే అలవాటుగా మారితే మాత్రం.. అస్సలు ఊరుకోనని తేల్చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తాయని గ్రహించిన రకుల్ ప్రీత్ సింగ్.. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఆ అభిప్రాయం నాకు, నా భర్తకు కూడా వర్తించదు.. దీనిపై ఎలాంటి తప్పుడు వార్తలు సృష్టించొద్దని క్లారిటీ ఇచ్చింది.

కొద్దినెలల క్రితం రకుల్ ప్రీత్ భర్త జాకీ భగ్నానీ కూడా రిలేషన్‌షిప్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. మా ఇద్దరికీ పెళ్లయినా మేమిద్దరం ఇప్పటికీ సిట్యుయేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా భావిస్తాం. అయితే సిట్యుయేషన్‌షిప్ అనే పదానికి బాధ్యత లేని బంధం అనే అర్ధం వస్తుండటంతో రకుల్‌తో జాకీ భగ్నానీకి పడటం లేదని ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయని ఊహాగానాలు వినిపించాయి. అయితే దీనిపై రకుల్ ఘాటుగా స్పందించారు. గంట పాటు జరిగిన సంభాషణలో ఒకే ఒక్క లైన్‌ను పట్టుకుని ఇలాంటి తప్పుడు హెడ్ లైన్స్ పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా రకుల్ సైతం రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

Read more about: rakul preet singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X