రొమాన్స్‌తో రెచ్చిపోయిన రకుల్.. అర్జున్ కపూర్‌తో మరింత ఘాటుగా

ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలువాలని సామెత చెబుతారు. కానీ ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాదిలో సత్తా చాటిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. గత రెండేళ్లుగా బాలీవుడ్‌లో జెండా పాతివేయాలని శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోతో చేస్తున్న రొమాన్స్ విషయం ప్రస్తుతం బాలీవుడ్‌ మీడియాలో హైలైట్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

Recommended Video

Rakul Preet Singh Bikini Photos Going Viral
అజయ్ దేవగన్‌తో మరీ నాటుగా

అజయ్ దేవగన్‌తో మరీ నాటుగా

గ్లామర్ గర్ల్‌గా క్రేజ్‌ను సంపాదించుకొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య శృంగారానికి ప్రాధాన్యమున్న చిత్రాల్లో ఎక్కువగానే కనిపిస్తున్నారు. హిందీలో దే దే ప్యార్ దే చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి చేసిన రొమాన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. ఆ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో తొలి హిట్‌ను తన ఖాతాలో వేసుకొన్నారు.

నాగ్‌తో శృంగారం ఒలకబోస్తూ..

నాగ్‌తో శృంగారం ఒలకబోస్తూ..

ఇక ఆ తర్వాత మన్మథుడు 2 చిత్రంలో నాగార్జునతో హాట్ హాట్‌గా నటించింది. రొమాంటిక్ సన్నివేశాల్లో మరింత అందాల ఆరబోతతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. అయితే అంతగా కష్టపడినా మన్మథుడు 2 చిత్రం చేదు ఫలితాన్ని ఇచ్చింది. దాంతో ఇప్పుడు దృష్టంతా బాలీవుడ్ చిత్రాలపైనే పెట్టారు.

అర్జున్ కపూర్‌తో రొమాంటిక్ మూవీలో

అర్జున్ కపూర్‌తో రొమాంటిక్ మూవీలో

ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో కలిసి ఓ రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. సరిహద్దు దేశాల మధ్య జరిగే ప్రేమ కథగా తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ లాక్‌డౌన్ కాలంలో నిలిచిపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం ప్రారంభించేందుకు సిద్దమైంది. ఆగస్టులో 10 రోజులు షూటింగ్ చేయాలని, అలాగే సెప్టెంబర్‌లో 4 రోజులు షూటింగ్‌కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

త్వరలోనే షూటింగ్‌కు వెళ్తున్నాం

త్వరలోనే షూటింగ్‌కు వెళ్తున్నాం

తాజాగా గతేడాది నవంబర్‌లో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాల తాలూకు పోస్టర్లను అర్జున్ కపూర్ తన ఇన్స్‌టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అర్జున్ కపూర్‌తో రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న రొమాన్స్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే త్వరలోనే మళ్లీ షూటింగుకు వెళ్తున్నాం. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను అంటూ రకుల్‌తో హాట్ ఫోటోలను షేర్ చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఇలా..

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఇలా..

రకుల్ ప్రీత్ కెరీర్ విషయానికి వస్తే.. ఎక్కువ శాతం హిందీ చిత్రాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఆమె నటించిన తమిళ చిత్రం ఐయాలాన్, కమల్‌తో ఇండియన్ 2 చిత్రాలు షూటింగు దశలో ఉంది. ఇక జాన్ అబ్రహంతో నటించిన ఎటాక్ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరో రెండు హిందీ సినిమాలు, ఓ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఒప్పుుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X