రాంచరణ్ సినిమాకు రకుల్ నో చెప్పిందా!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. బోయపాటి ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం వంటి భారీ హిట్ తరువాత రాంచరణ్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని రూపొందిస్తున్నారట. ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించాలని దర్శకుడు భావించాడు. దీనితో రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఐటెం సాంగ్ ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తాను తమిళంలో బిజీగా ఉన్నానని ఐటమ్ సాంగ్ చేయలేనని చెప్పిందట. రకుల్ నో చెప్పడంతో ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీలని వెతికే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, రాంచరణ్ కలసి ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











