ఫ్రెండ్లీగానే అది కావాలని అడిగాడు.. అందుకే గీత గోవిందంలో నటించలేదు.. రకుల్ ప్రీత్ కామెంట్స్
నిత్యం ఫిట్‌నెస్ కోసం పరితపించే రకుల్ ప్రీత్‌కు ప్రస్తుతం టైమ్ కలిసి రావడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోయిన ఈ కూల్ బ్యూటీ ప్రస్తుతం.. విజయాలు లేక వెనుకబడిపోయింది. టాలీవుడ్‌లో ఈ అమ్మడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చివరగా వచ్చిన మన్మథుడు 2 చిత్రం బెడిసికొట్టడం ఒకెత్తు అయితే, రకుల్ లుక్స్, అప్పియరెన్స్‌కు నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. తాజాగా రకుల్‌కు సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

మంచి ఆఫర్ మిస్..
హీరోలకైనా, హీరోయిన్లకైనా వారి కెరీర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలను వదులుకున్న సందర్భాలుంటాయి. ఓ హీరో వద్దనుకున్న చిత్రాలు.. మరో హీరో దగ్గరికి వెళ్లి ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సందర్భాలున్నాయి. అలాగే హీరోయిన్ల విషయంలోనూ ఒకరు కాదనుకున్న ప్రాజెక్ట్‌లు మరొకరి చేతికి వెళ్లి.. వారికి ఎనలేని క్రేజ్‌ను తీసుకొస్తుంటాయి. ప్రస్తుతం రకుల్ కూడా అలాంటి ఓ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకుంది.

గీతగోవిందం సినిమాకు నో..
తెలుగులో ఈ మధ్య కాలంలో గీతగోవిందం అంతటి సంచలనం సృష్టించిన మరో చిత్రం లేదంటే అతిశయోక్తి లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా అందర్నీ ఆక్టట్టుకున్న ఈ చిత్రాన్ని రకుల్ వదులుకుందట. బాలీవుడ్‌లో ‘దే దే ప్యార్ దే' సినిమాకు ఒప్పుకోవడంతో డేట్లు కుదరక ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందట.

అందుకే నో..
తనకు గీత గోవిందంలో నటించే అవకావం వచ్చిందని, కానీ తాను అప్పటికే దే దే ప్యార్ దే సినిమాతో బిజీగా ఉన్నానని తెలిపింది. డేట్లు ఖాళీ చేసుకుందామన్నా కూడా కుదరలేదని పేర్కొంది. దాంతో ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చింది.

బాధ లేదు కానీ..
అయితే సినిమాను వదులుకున్నందుకు బాధ లేదు కానీ.. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కనీసం అందులో ఓ చిన్న క్యారెక్టర్ చేసినా బాగుండేది అనిపించిందని తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. పరశురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు పైరసీకి గురైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో విజయ్, రష్మిక కెమిస్ట్రీ క్రేజీగా ఉందంటూ కామెంట్లు వచ్చాయి. గీత పాత్రకు పెద్ద హీరోయిన్లను కూడా అప్రోచ్ అయ్యాము కానీ ఎవ్వరూ అంగీకరించలేదని అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూలో విజయ్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది.
Recommended Video

ఫ్రెండ్లీ గానే అడిగాడు..
ఇండస్ట్రీలో తనతో కలిసి నటించిన ఓ హీరో సెక్స్ కావాలని కూడా అడిగాడని నిర్మొహమాటంగా చెప్పేసింది. అయితే క్యాస్టింగ్ కౌచ్‌లా అసభ్యకరంగా కాకుండా మర్యాదపూర్వకంగానే అడిగాడని తెలిపింది. కానీ తనకు ఇంట్రెస్ట్ లేదని నో చెప్పేశానని చెప్పుకొచ్చింది రకుల్. ఇంతకీ ఆ కో స్టార్ ఎవరా? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











