Rakul Preet Singh: రకుల్ కి తీవ్ర గాయం.. పూర్తిగా బెడ్ రెస్ట్.. అసలేం జరిగిందంటే?

Rakul Preet Singh: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ రకుల్. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ లో అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే.. ఈ హీరోయిన్ కి తీవ్ర గాయం కావడంతో ఆస్పతి పాలైనట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో ఓ లూక్కేయండి.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు గాయం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల జిమ్‌లో వర్కవుట్ చేసే సమయంలో గాయపడట్టు తెలుస్తోంది. ఎలాంటి సెప్టీ లేకుండా.. 80 కేజీల వేయిట్ ను లిఫ్ట్ చేసే సమయంలో రకుల్ వెన్నుముక్కకు గాయమైందట. వైద్యులు ఆమెను పరిశీలించి కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయినప్పటికీ, ఆమె వరుసగా రెండు రోజులు 'దే దే ప్యార్ దే 2' షూటింగ్ కొనసాగించారని తెలుస్తోంది.

Rakul Preet Singh serious injury during workout

వాస్తవానికి రకుల్ కి గాయం అయ్యి రెండు వారాలపైనే అవుతుందట.. పలు నివేదిక ప్రకారం.. అక్టోబర్ 5 ఉదయం రకుల్ .. తన జిమ్ లో వర్కవుట్ చేసే సమయంలో సెప్టీ బెల్ట్ ధరించకుండా 80 కిలోల డెడ్‌లిఫ్ట్ చేశారట. దీంతో తీవ్ర నొప్పివస్తుందట. 3 రోజులు నొప్పితో బాధపడిన తర్వాత, ఆమె ఫిజియోను కలిశారంట. ప్రతిసారీ 3-4 గంటలకు ఓ సారి తీవ్రమైన నొప్పివస్తుందట.

దీంతో డాక్టర్ ను కలువగా..సెప్టీ బెల్ట్ లేకుండా.. ఎక్కువ బరువును ఎత్తడంతో వెన్నెముకలోని ఎల్4, ఎల్5 అలాగే ఎస్1 సమీపంలోని నరాలపై ఒత్తిడి పడిందని, ఇందుకోసం దాదాపు రెండు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ సూచించారట. ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుందట. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

Rakul Preet Singh serious injury during workout

కాకపోతే ఈ వార్త కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రకుల్ త్వరగా గాయం నుండి కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటారంట. బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం'దే దే ప్యార్ దే 2' షూటింగ్‌లో బిజీ బిజీగా ఉందట. షూటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. వర్కవుట్ చేస్తున్న సమయంలో రకుల్‌ప్రీత్ తీవ్ర గాయపడినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: rakul preet singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X