For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హెడ్‌లైన్స్ కోసం ఏదైనా రాసేస్తారా? రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్.. హరీష్ శంకర్ అలా సపోర్ట్!

  |

  టాలీవుడ్‌కు దూరమవుతున్నట్టు మీడియాలో వస్తున్న కథనాలపై అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్‌కు చెందిన ఓ ఆంగ్ల వెబ్‌సైట్ రాసిన ఓ కథనంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాను చెప్పని విషయాలను ఎలా రాస్తారంటూ ప్రశ్నించింది. తన కెరీర్ గురించి వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కాస్త ఘాటుగానే స్పందించింది. రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళితే...

  లాక్‌డౌన్ తర్వాత ఆరు హిందీలో సినిమాలతో

  లాక్‌డౌన్ తర్వాత ఆరు హిందీలో సినిమాలతో

  ఇటీవల కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో తక్కువ సినిమాలు చేస్తున్నారనే వాదన, అభిప్రాయం మొదలైంది. అందుకు కారణం హిందీ సినిమా ప్రాజెక్టులకు ఓకే చెప్పడమే. లాక్‌డౌన్ తర్వాత దాదాపు అరడజన్ హిందీ సినిమాలను అంగీకరించిందనే వార్తలు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.

  ఏదైనా రాసేస్తారా? అంటూ రకుల్

  ఏదైనా రాసేస్తారా? అంటూ రకుల్

  అయితే హైదరాబాద్‌కు చెందిన ఆంగ్ల దినపత్రిక తన కథనంలో రకుల్ ప్రీత్ సింగ్ గురించి వెల్లడిస్తూ... తెలుగు సినిమాల్లో తనకు ఆఫర్లు రావడం లేదు. అందుకే సినిమాలు చేయడం లేదు అంటూ ఆమె చెప్పినట్టు ఓ వార్త ప్రచురితమైంది. ఆ వార్తను చూసిన రకుల్ తన ట్విట్టర్‌‌లో షేర్ చేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. హెడ్‌లైన్స్ కోసం ఏదైనా రాసేస్తారా అంటూ రకుల్ హ్యాష్ ట్యాగ్‌తో ఫైర్ అయ్యారు.

  ఏడాదికి 365 రోజులే..

  ఏడాదికి 365 రోజులే..

  రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. నేను ఎప్పుడు? ఎక్కడ ఇలాంటి మాటలు చెప్పలేదే అన్నట్టు పేర్కొన్నారు. తాను అలాంటి మాటలు ఎక్కడా చెప్పలేదంటూ స్పష్టం చేశారు. ఫ్రెండ్స్ మనకు కేవలం 365 రోజులు మాత్రమే ఉన్నాయి. సంవత్సరంలో నేను ఆరు సినిమాలు చేస్తున్నాను. ఒకవేళ ఆరు సినిమాలకు మించి ఎవరైనా డేట్స్ అడ్జస్ట్ చేయగలిగితే చెప్పండి.. నేను ఎన్ని సినిమాలైనా చేయడానికి సిద్దం. ఆ విషయంలో మా టీమ్‌కు సహకరించండి అంటూ రకుల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  రకుల్‌కు సపోర్ట్‌గా హరీష్ శంకర్

  రకుల్‌కు సపోర్ట్‌గా హరీష్ శంకర్

  ఇదిలా ఉండగా, రకుల్ ప్రీత్ సింగ్ గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అవును రకుల్ ప్రీత్ గురించి నాకు బాగా తెలుసు. నా స్నేహితుడు ఆమె డేట్ల కోసం చాలా కష్టపడ్డాడు. ఆమె బిజీగా ఉండటంతో ఆ సినిమాను వాయిదా వేసుకొన్నాడు. రకుల్ మంచి సినిమాలు చేసి అందర్నీ ఆకట్టుకోవాలి.. ఆమె వర్క్ అందరూ ప్రశంసించాలి అంటూ హరీష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

  Rakul Preet Singh Revealed Her Role In Director Krrish Movie ​| Filmibeat Telug
  రకుల్ ప్రీత్ సింగ్ సినీ కెరీర్ ఇలా

  రకుల్ ప్రీత్ సింగ్ సినీ కెరీర్ ఇలా

  ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమా కెరీర్ విషయానికి వస్తే... ఇటీవల అంటే సెకండ్ వేవ్‌కు సంబంధించిన లాక్‌డౌన్‌కు ముందు నితిన్‌తో కలిసి చెక్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పంజా వైష్ణవ్‌ తేజ్‌తో ఓ చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. అలాగే హిందీలో ఆమె నటించిన సర్దార్ కా గ్రాండ్ సన్ ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. ఇకాం ఆయాలాన్, ఎటాక్, మేడే, థ్యాంక్స్ గాడ్, ఇండియన్ 2 చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకొన్నారు. అలాగే దిల్ హై దీవానా అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో అర్జున్ కపూర్‌తో కలిసి కనిపించారు.

  English summary
  Rakul Preet Singh Serious on Media Report over No offers in Tollywood. She wrote in twitter that, I wonder when I said this Face with rolling eyesThinking faceFace with tears of joyFriends there are only 365 days in a year and if you can help in adjusting more than 6 films that iam doing right now then plz help my team. Face with tears of joy Folded handsSmiling face with halo#anythingforheadlines twitter.com/thehansindiawe…
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X