twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంక ఏం చూస్తారు.. ఎందుకింత టూమచ్.. రకుల్ ప్రీత్ మండిపాటు

    |

    లాక్‌డౌన్ నిబంధనలు సడలించడం, విమాన సర్వీసులు పునరుద్దరించడంతో సినీ ప్రముఖులు రెండు నెలల స్వీయ గృహ నిర్బంధం తర్వాత మళ్లీ బాహ్య ప్రపంచంలోకి అడుపెట్టారు. తాజాగా అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ముంబై విమానాశ్రయంలో మీడియా కంటపడ్డారు. అయితే తనను చుట్టుముట్టి ఫోటోలు తీయడానికి ప్రయత్నించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఫోటోలకు ఫోజు ఇవ్వకుండా రుసరుస నడుచుకొంటూ వెళ్లిపోయారు. అయితే గరం గరంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు రకుల్ చేసిన కామెంట్లు ఏమిటంటే..

     ‘కరోనా' దుస్తుల్లో రకుల్

    ‘కరోనా' దుస్తుల్లో రకుల్

    కరోనావైరస్ భయంతో రకుల్ ప్రీత్ సింగ్ బందోబస్తుగా తయారయ్యారు. అరికాలి నుంచి తల వరకు తెల్లటి ప్లాస్టిక్ దుస్తులతో కూడిన పీపీఈ సూట్ ధరించి గుర్తుపట్టకుండా తయారయ్యారు. ముఖానికి మాస్క్ ధరించి గుర్తుపట్టకుండా రెడీ అయ్యారు.అయినా తనను గుర్తించడంపై రకుల్ స్పందిస్తూ.. నన్ను ఎవరు గుర్తు పట్టరనే సంతోషంలో ఉన్నాను. కానీ ఫోటోగ్రాఫర్లు నన్ను ఎలాగైనా గుర్తు పట్టేశారు అంటూ చెప్పిన మాటలు వీడియోలో వినిపించాయి.

     రకుల్ వెంటపడిన ఫొటోగ్రాఫర్లు

    రకుల్ వెంటపడిన ఫొటోగ్రాఫర్లు

    రకుల్ ఫోటోకు ఫోజివ్వు.. వెనుకకు తిరిగి కెమెరా వైపు చూడు అంటూ ఫొటోగ్రాఫర్లు వెనుకకు తిరగమని పిలుస్తుండటంతో చిరాకు పడ్డారు. ఇంకే చూస్తారు మీరు. ఫోటోలు తీయవద్దు. ఎందుకింత టూమచ్ అటెన్షన్ అంటూ రకుల్ మండిపడ్డారు. అసహనంతో వారిని కొరకొర చూస్తూ ఎయిర్‌పోర్టులోకి వెళ్లిపోయింది. ఆమె వెంట

    కెమెరాలతో క్లిక్కుల మోత

    కెమెరాలతో క్లిక్కుల మోత

    రకుల్ చిరాకు పడినప్పటికీ ఫొటోగ్రాఫర్లు కెమెరా ఫ్లాష్‌లతో క్లిక్కుల మోత మోగించారు. తన దారికి అడ్డు తగలకుండా వెళ్లనివ్వమనేలా సంకేతాలు ఇవ్వడం వీడియోలో కనిపించింది. అయినా ఫొటోగ్రాఫర్లు సరికొత్తగా కరోనా దుస్తుల్లో కనిపించిన రకుల్ ఫోటోలు తీస్తూ వెంటపడ్డారు.

    లాక్‌డౌన్‌లో పేదలకు అన్నదానం

    లాక్‌డౌన్‌లో పేదలకు అన్నదానం

    ఇదిలా ఉంటే లాక్ డౌన్ కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబం సామాజిక సేవలో నిమగ్నమయ్యారుు. గుర్గావ్‌లోని తన ఇంటికి సమీపంలోని సుమారు 200 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. చాలా మంది కుటుంబాలకు నిత్యం ఆహార ప్యాకెట్లు అందించారు. తన కుటుంబం చేపట్టిన సేవలను రకుల్ వివరిస్తూ.. మా నాన్న మా ఇంటికి సమీపంలో ఉండే పేద కార్మిక కుటుంబాలను గుర్తించి వారికి సహాయం అందించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రతీ ఒక్కరికి రెండు మీల్స్ ప్యాకెట్లను అందించే చర్యలు చేపట్టారు అని రకుల్ చెప్పారు.

    English summary
    Rakul Preet Singh serious over Paparazzi. When she out from quarantine in lockdown. Photographers captered Rakul at Mumbai Airport.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X