Just In
- 1 hr ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 1 hr ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 2 hrs ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 3 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- News
కిసాన్ పరేడ్ .. సింఘూ, తిక్రీ , ఘాజీపూర్ బోర్డర్ లో ఉద్రిక్తత .. పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం
- Sports
డబ్బుల కోసమే బెయిర్‌స్టో ఐపీఎల్ ఆడుతాడు.. డిక్విల్లా స్లెడ్జింగ్.. ఆ వెంటనే ఔట్! వీడియో
- Finance
మిసెస్ బెక్టార్స్ అధినేతకు, జోహో వ్యవస్థాపకుడికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
70 సార్లు పడిలేచిన రకుల్ ప్రీత్ సింగ్.. అయినా బికినీలో జోష్ తగ్గకుండా..
లాక్‌డౌన్ కారణంగా సినీ తారలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే విహార యాత్రల పేరుతో విదేశాల్లో వాలిపోతున్నారు. అయితే తన కుటుంబంంతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. తన పర్యటనకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకొంటూ...

మాల్దీవుల్లో రకుల్ విహార యాత్ర
మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ హంగామా, బికినీ ఫోటోలు వైరల్ అయ్యాయి. రకరకాల విన్యాసాలతో నెటిజన్లను, అభిమానులను ఆకట్టుకొన్నారు. ఆమె పోస్టు చేసిన అందాల ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి. రకుల్ బికినీ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు.

రకుల్ అవుట్ డోర్ యాక్టివిటీస్
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా మాల్దీవుల అనుభవాలను పంచుకొన్నారు. సముద్రంలో అవుట్ డోర్ ఆక్టివిటీస్ గురించిన ఫోటోలను షేర్ చేసింది. వాటర్‌లో ఫ్లైబోర్డు యాక్టివిటీ గురించి ఆసక్తికరంగా వెల్లడించింది. అవుట్ డోర్ యాక్టివిటీలో భాగంగా వాటర్‌లో బోర్డుపై నిలబడిన ఈవెంట్ నాకు అమితానందాన్ని ఇచ్చింది అంటూ తెలిపింది.

70 సార్లు పడిపోయా
సముద్రంలో ఫ్లైబోర్డు యాక్టివిటీ చాలా కష్టమైనది. దాదాపు 70 సార్లు పైనుంచి పడిపోయాను. ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ గేమ్ ఆడే ముందు రకరకాల జాగ్రత్తలు తీసుకొంటారు. తలకు హెల్మెట్ లాంటి దాన్ని ధరించేలా చేస్తారు. శరీరానికి కూడా దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకొంటారు అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.

టాలీవుడ్‌లో ఏడేళ్లు పూర్తి
ఇక కెరీర్ విషయానికి వస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే టాలీవుడ్‌లో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొన్నది. తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి నవంబర్ 29 నాటికి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొన్నదంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. తనకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు రావడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాలు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఇలా
ఇక తెలుగులో మన్మథుడు 2 చిత్రం తర్వాత ప్రస్తుతం నితిన్‌తో కలిసి చెక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 2021లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. అలాగే క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో కూడా విభిన్నమైన పాత్రను పోషిస్తున్నది. హిందీలో ఎటాక్, అయాల్‌యాన్, సర్దార్ అండ్ గ్రాండ్‌సన్, మేడే చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2లో కనిపించనున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.