లంకలో ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి (ఫోటోస్)
Recommended Video

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో టాప్ రేంజికి ఎదిగిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో పని చేసే అవకాశం దక్కించుకుంది. అంతే కాదు ఇక్కడ చాలా మంది స్నేహితులను ఏర్పరచుకోవడంతో పాటు హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కుని సెటిలైంది. సినిమాలతో పాటు సైడ్ బిజినెస్‌లు కూడా చేస్తూ దూసుకెళుతోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొన్ని ఫోటోస్ పోస్టు చేశారు. మంచు లక్ష్మితో కలిసి ఆమె హాలిడేలో ఉన్నట్లు తెలుస్తోంది.

మంచు లక్ష్మితో రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ బెస్ట్ ఫ్రెండ్స్‌లో మంచు లక్ష్మి ఒకరు. ఇటీవల మంచు లక్ష్మితో కలిసి దిగిన ఓ ఫోటోను రకుల్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

శ్రీలంకలో ఎంజాయ్ చేస్తూ
అక్టోబర్ 8న మంచు లక్ష్మి పుట్టినరోజు, అక్టోబర్ 10న రకుల్ బర్త్ డే. ఈ నేపథ్యంలో వీరు డిజైనర్ కోన నీరజ, మరికొందరు ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీలంక వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది.

నెటిజెన్స్ సరదా కామెంట్స్
ఈ ఫోటో చూసిన ఓ నెటిజన్ కొందరు సరదా కామెంట్స్ ... రకుల్ ప్రీత్‌కు బాయ్ ఫ్రెండ్ లేడు. ఈ ఫోటో చూస్తుంటే ఆమె లెస్పియన్ అనే అనుమానం కలుగుతుంది అంటూ కామెంట్ చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఎన్‌జికె సినిమాతో పాటు, కార్తి, శివకార్తికేయన్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు హిందీలో దేదే ప్యార్‌దే సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











