మాల్దీవ్స్ లో ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న రకుల్.. అయినా తగ్గకుండా అందాల ఆరబోత.. మాములుగా లేదుగా!
రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో సినిమాలు చేయడం ప్రారంభించిన ఆమె అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్ కి వెళ్లిన ఆమె అక్కడ సెటిల్ అవడమే కాక అక్కడ ఒక నటుడు, నిర్మాత అయిన వ్యక్తిని ప్రేమించి, త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. అయితే అతనితో కలిసి మాల్దీవులకు వెకేషన్ కి వెళ్ళిన రకుల్ ప్రీత్ సింగ్ అందాలు ఆరబోస్తున్న అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకునే ఆమె తాజాగా పంచుకున్న ఫోటోలతో మరోసారి టెంపరేచర్ పెంచేసింది. ఆ వివరాల్లోకి వెళితే

పాకెట్ మనీ కోసం
చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేస్తూ వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ అనుకోకుండా 7g బృందావన్ కాలనీ కన్నడ రీమేక్ లో హీరోయిన్ గా ఎంపికయింది.. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేస్తుంటే తక్కువ డబ్బులు వస్తున్నాయి హీరోయిన్ గా నటిస్తే దానికి పదింతలు డబ్బులు వస్తాయి అని ఎవరు చెప్పడంతో ఆమె హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది.

స్టార్ హీరోయిన్
అలా మొదలైన ఆమె కెరీర్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఒక కీలక మలుపు తీసుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తనకు వరుస అవకాశాలు దక్కాయి. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అలా ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది.

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా
అయితే ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మోస్ట్ క్రేజియస్ట్ అండ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే కేవలం ఈ ఏడాదిలోనే ఆమె నటించిన దాదాపు ఆరు సినిమాలు హిందీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అందాల ఆరబోత
వీటిలో కేవలం మూడు నాలుగు సినిమాలు హిట్ అయినా సరే ఆమె రేంజ్ మరి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదిలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య అందాల ఆరబోతకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రేమలో పడింది కదా ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఎందుకు అనుకుంటుంది అనుకున్నారు కానీ ఇప్పుడు మాల్దీవులకు వెకేషన్ వెళ్లిన ఆమె తన హాట్ ఫోటోలు షేర్ చేయడం మొదలుపెట్టింది.
అందాల ఆరబోత
గత ఏడాది జాకీ భగ్నాని అనే హిందీ నిర్మాత కం నటుడిని ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని బయటపెట్టిన ఆమె ఇప్పుడు ఆయనతో కలిసి విహారానికి వెళ్ళి అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.
ముందుగా ఎద అందాలను చూపిస్తూ ఉన్న ఒక ఫోటో షేర్ చేసిన ఆమె ఇప్పుడు తాజాగా బ్యాక్ నుంచి తన అందాన్ని చూపిస్తూ ఒక ఫోటో వదిలింది. ఒక రకంగా తన అందాలను ఆరబోస్తూ రెచ్చగొట్టే విధంగా రకుల్ మారిపోయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత ఫోటోలు చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











