మళ్ళీ బికినీ పిక్ షేర్ చేసిన రకుల్... హనీ మూన్ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ...
పెళ్లయ్యాక రకుల్ ప్రీత్ సింగ్ మరింత హాట్ గా మారింది. తాజాగా ఈ పంజాబీ బ్యూటీ మరో బికినీ పిక్ ను షేర్ చేసింది. ఈ ఫోటోకి రకుల్ ప్రీత్ సింగ్ అందమైన క్యాప్షన్ ఇచ్చింది. 'సూర్యాస్తమయం సమయంలో ఈత కొట్టండి, సొరచేపలను చూడండి, ఫిజియన్ సంస్కృతిని ఆస్వాదించండి. మేము ఇవన్నీ చేశాము" అంటూ తాజా పిక్ ని షేర్ చేసింది రకుల్. ఇంకెందుకు ఆలస్యం ఆ పిక్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే బాలీవుడ్ నిర్మాత, తన ప్రియుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. ఇప్పుడు హనీమూన్‌కి వెళ్లి ఆ ఫోటోలను షేర్ చేశారు. రకుల్, జాకీ చాలా ఏళ్లుగా ప్రేమించుకుని, ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు.

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మోడ్రన్ లేడీగా మారిపోయింది. ఆమె స్టైలిష్ బీచ్ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పెళ్లయ్యాక మరింత హాట్ గా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన క్రేజీ హీరోయిన్ రకుల్ తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కిక్ ఇస్తోంది. బోల్డ్ లుక్‌తో పోజులిచ్చిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ఈ ఫోటోలను ఇప్పుడు ఆమె అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
కొకోమో అనే ప్రైవేట్ దీవికి వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ టూ పీస్ బికినీలో ఫోటోలకు ఫోజులిచ్చింది. రకుల్ బోల్డ్ లుక్ ఫోటోలను భర్త జాకీ భగ్నాని తీశారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగి నార్త్ కి షిఫ్ట్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ముంబైకి షిఫ్ట్ అయ్యాక ట్రెండ్ మార్చేసింది. ఫోటో షూట్‌లతో గ్లామర్ ఎక్స్‌పోజ్‌లు, స్టైల్ షోలు చేస్తోంది.

రీసెంట్ గా షేర్ చేసిన ఈ ట్రెండీ పిక్చర్స్ కి 48 గంటల్లోనే 5 లక్షల వ్యూస్, వేల లైక్ లు వచ్చాయి అంటే రకుల్ ప్రీత్ సింగ్ బికినీలో ఎంత హాట్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా పిక్స్ చూసిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ అద్భుతంగా, అందంగా ఉందని, అందమైన అమ్మాయి అని అభిమానులు కామెంట్‌లను పంచుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రకుల ఫోటోలో సందడి చేస్తున్నాయి.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు, కెరీర్ డల్ కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఎట్టకేలకు తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ముంబైలో కూడా తన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో సైలెంట్ గా ఉంది. సినిమా అవకాశాలు లేకపోయినా వెబ్ సిరీస్ లు, కమర్షియల్ యాడ్ ఫోటోషూట్ లతో రకుల్ బిజీగా ఉంది. మరి ఈ నటి టాలీవుడ్‌లో తిరిగి అడుగు పెడుతుందా లేదా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











