నాకు అలాంటి మొగుడు కావాలి.. డబ్బు కోసం కాదు.. తొలిసారి భయమేసింది.. రకుల్ ప్రీత్

సాధారణంగా తమకు కాబోయే వాడి విషయంలో హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు అందాల తారలు. హ్యాండ్‌సమ్‌గా ఉండాలి.. ఇంతే వయసుండాలి అంటూ రకరకాల కండిషన్స్ పెట్టుకొని జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తుంటారు. ఈ కోవలోనే ఇప్పటికే పలువురు యంగ్ హీరోయిన్స్ తమకు నచ్చిన వాడిని కట్టుకొని సెటిలై పోయారు కూడా. అందులో కొందరు బిజినెస్ మెన్స్ ని పెళ్ళాడగా మరికొందరు తోటి హీరోలకు భాగస్వాములుగా మారారు. కాగా ఢిల్లీ బేబీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తన పెళ్లి విషయమై ఆసక్తికరంగా స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకు ఎలాంటి మొగుడు కావాలన్నందంటే..

 అజయ్ దేవగన్ తో ప్రేమలో..

అజయ్ దేవగన్ తో ప్రేమలో..

టాలీవుడ్‌తో పాటు ఇతర భాషా చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ నటిస్తున్న తాజా సినిమా ‘దే దే ప్యార్ దే'. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ బాలీవుడ్ మూవీలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ టబు, అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాకపోతే ఇక్కడ అజయ్ దేవగన్ భార్యగా టబు, ప్రేయసిగా రకుల్ కనిపించనుండటం విశేషం.

వయసులో దాదాపు పాతికేళ్ల తేడా

వయసులో దాదాపు పాతికేళ్ల తేడా

హీరో అజయ్ దేవగన్‌తో పోల్చితే రకుల్ ప్రీత్ వయసు చాలా తక్కువ. ఈ మధ్య వయసు పరంగా చూస్తే దాదాపు పాతికేళ్ల తేడా ఉంది. అయినప్పటికీ ఆయనకు ప్రేయసిగా రకుల్ నటించడం అందరిలోనూ అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో రకుల్ నిజ జీవితంలోని ప్రేమ, పెళ్లి విషయాలపై పడింది అందరి కన్ను.

ప్రేమ విషయంలో రకుల్ స్పందన

ప్రేమ విషయంలో రకుల్ స్పందన

ప్రస్తుతం ‘దే దే ప్యార్ దే ప్రమోషన్స్'ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న రకుల్ ప్రీత్ సింగ్‌కి ఓ జర్నలిస్ట్ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘‘నిజ జీవితంలో కూడా మీ కంటే వయసులో పెద్ద వాడైన వ్యక్తిని ప్రేమిస్తారా?'' అని అడిగిన ప్రశ్నకు ఆమె ఆశ్చర్యపరిచేలా సమాధానం చెప్పింది. ప్రేమలో పడేందుకు తాను ఎదురు చూస్తున్నానని, అయితే అతను యువకుడా.. వృద్ధుడా అనేది తనకు అనవసరమని చెప్పి షాకిచ్చింది రకుల్.

డబ్బు వెనుక పరుగెత్తడం లేదని

డబ్బు వెనుక పరుగెత్తడం లేదని

దేదే ప్యార్ దే మూవీ ప్రమోషన్‌లో భాగంగా రకుల్ మాట్లాడుతూ.. నేను డబ్బు వెనుక పరుగెత్తడం లేదు. మంచి సినిమాల కోసమే ఎదురుచూస్తున్నాను. సినిమా అంటే నాకు ప్యాషన్. దే దే ప్యార్ దే విషయానికి వస్తే ఇద్దరు జాతీయ అవార్డులు గెలుచుకొన్న హీరో, హీరోయిన్లతో నటిస్తున్నానే ఫీలింగ్ గొప్పగా ఉంది. వారితో పనిచేస్తున్నాననే అంశం నాకు ఎక్సైటింగ్‌గా లేదు. వారితో నటించాలంటే ముందు నాకు భయమేసింది అని రకుల్ చెప్పింది.

మే 17న రిలీజ్

మే 17న రిలీజ్

తెర మీద గ్లామర్ రోల్స్ చేయడం చాలా కష్టం. అయితే దే దే ప్యార్ దే సినిమాలో కామెడీతో కూడిన క్యారెక్టర్‌ను చేయాల్సి రావడం చాలా కష్టంగా మారింది. తెర మీద కామెడీని పండించడం అంతా సులభం కాదు. కామెడీలో సరైన టైమింగ్ లేకపోతే సీన్లు తేలిపోతాయి అని రకుల్ చెప్పారు. టీ సిరిస్, లవ్ రంజన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అకివ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మే 17న రిలీజ్ కానున్నది.

కలిసొచ్చే టైమ్ వచ్చినట్లేనా..?

కలిసొచ్చే టైమ్ వచ్చినట్లేనా..?

కొద్ది కాలం క్రితం తెలుగులో వరుస సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచిన రకుల్.. ఈ మధ్య కాలంలో కాస్త డీలా పడింది. దీంతో రూటు మార్చేసి ఇతర భాషా సినిమాల వైపు తన అడుగేసింది. ఇక అక్కడే సెటిలైపోతుందేమోనని అనుకుంటున్న ఈ టైమ్‌లో తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన్మధుడు 2' సినిమాలో అవకాశం దక్కించుకుంది రకుల్. అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న ఈ సినిమాతో తెలుగు తెరపై మరోసారి తన అందచందాల మ్యాజిక్ చేయాలని కుతూహలంగా ఉందీ భామ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X