దానికోసం చెమటోడ్చాల్సిందే.. ఆలోచనా విధానం మారాలి.. లైఫ్ రిస్క్‌లో పెడతామా?: రకుల్ ప్రీత్ సింగ్
యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తన కెరీర్, సినిమా సంగతులతో పాటు తన వ్యక్తిగత అలవాట్లు తదితర విషయాలపై స్పందించింది. ఈ మేరకు సినిమాల కోసం తన లైఫ్ రిస్క్‌లో పెట్టుకోలేనని, ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ కోసం తన నిర్ణయాన్ని మార్చుకోనని రకుల్ అంటోంది. వివరాల్లోకి పోతే..

టాలీవుడ్ టు బాలీవుడ్.. రకుల్ హవా
టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రకుల్.. ఆ తర్వాత బాలీవుడ్ తెరపై కాలుమోపి బీ టౌన్ లోనూ తన అందాల రుచి చూపించింది. రకుల్ అందాలకు ఫిదా అయిన బాలీవుడ్ జనం ఆమె సినిమాలపై మోజు పడుతున్నారు.

రకుల్ జీరో సైజ్.. సెక్సీ బ్యూటీ
దక్షిణాది తెరపై కాస్త బొద్దుగా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్‌లో అడుగుపెట్టాక జీరోసైజుకి మారిపోయింది. సన్నబడి నాజూకుగా అందాలు ఆరబోస్తూ సెక్సీ బ్యూటీ అనిపించుకుంటోంది. ఈ మేరకు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యువతను మత్తెక్కిస్తోంది.

అంత ఈజీ కాదు.. దాన్నిబట్టే అన్నీ జరుగుతాయి
గతంలో చాలాసార్లు తన ఫిట్‌నెస్, డైటింగ్ గురించి స్పందించిన రకుల్.. తాజా ఇంటర్వ్యూలో మరోసారి ఆ అంశాన్ని లేవనెత్తింది. ఫిట్‌నెస్ అనేది జీవితాంతం ఉండాలని, అది ఓ వారంలోనో లేక పది రోజుల్లోనే వచ్చేది కాదని చెప్పింది.మనం ఏం తింటున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం అనే దాన్ని బట్టే ఫిట్‌నెస్ ఉంటుందని పేర్కొంది.

అదే మాట అంటారు.. ఆ ఆలోచనా విధానం మారాలి
ఫిట్‌నెస్ కోసం చెమటోడ్చాల్సిందే అంటోంది రకుల్. అలా అయితేనే ఆరోగ్యంగా ఉంటామని చెబుతోంది. తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫిట్‌నెస్ ఫొటోలు చూసి జిమ్ చేయాలని కనీసం ఒక్కరికి అనిపించినా సంతోషమే అని రకుల్ పేర్కొంది. టైం లేక నేను జిమ్‌కి వెళ్లలేదు అని చాలా మంది అంటుంటారు.. కానీ ఆ ఆలోచనా విధానం మారాలని ఆమె తెలిపింది.

లైఫ్ రిస్క్‌లో పెడతామా?
సినిమాల్లో నటిస్తున్నాం కదా అని లైఫ్ రిస్క్‌లో పెడతామా? అంటోంది రకుల్. ఎవరో వచ్చి సినిమా కోసం బరువు పెరగాలి అంటే.. తాను అస్సలు పెరగనని, ఫిట్‌నెస్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తానని అంటోంది.

అలాంటోడు దొరికితే సిద్దమే..
ఇకపోతే ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. తనతో జీవితం పంచుకునే వాడు కనీసం ఆరడుగులైనా ఉండాలని ఆమె తెలిపింది. హైట్‌తో పాటు తెలివైన వాడై కూడా ఉండాలని, అలాంటి క్వాలిటీస్ ఉన్న వరుడు దొరికితేనే తాను పెళ్లికి సిద్దమే అని చెప్పింది.
Recommended Video


రకుల్ జర్నీ.. నాగార్జునతో రొమాన్స్
ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్‌లో ఇటీవలే నాగార్జున సరసన 'మన్మథుడు 2'లో రొమాన్స్ చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో టాలీవుడ్‌లో ఆమె జోష్ తగ్గింది. ప్రస్తుతం 'భారతీయుడు 2' సినిమాలో కమల్ హాసన్ సరసన నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో మరో రెండు సినిమాలు చేస్తోంది రకుల్.


Click it and Unblock the Notifications











