కరోనా సమయంలో రకుల్ ప్రీత్ షూటింగ్.. సర్కార్ ఆదేశాలు బేఖాతరు
కరోనా భయాలతో సినీ పరిశ్రమ లాక్‌డౌన్ ప్రకటిస్తే.. అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఎంచక్కా షూటింగ్‌లతో ఎంజాయ్ చేసింది. తాజాగా ముంబైలో జరిగిన ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొనడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. యాడ్ షూటింగ్ చేసినట్టు రకుల్ కూడా స్వయంగా అంగీకరించింది. ఇంట్లోనే ఉండాలని సినీ ప్రముఖులు ఓ పక్క సలహాలిస్తుంటే.. ఈ బ్యూటీ షూటింగ్‌లో పాల్గొనడంపై వివాదం ఎక్కడికి దారి తీస్తుందోననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఓ బ్రాండ్ కంపెనీ కోసం యాడ్ షూట్ చేశాను. పెద్దగా తిరిగే పనిలేకుండా ఒక్కచోటనే షూట్ ఉండటం వల్ల షూటింగ్‌కు ప్లాన్ చేశాం. అందుకు తగిన రక్షణ చర్యలు తీసుకొన్నాం. చిత్ర యూనిట్ అందరికి సరైన భద్రత కల్పించాం అని రకుల్ చెప్పారు.

ప్రభుత్వ ఆదేశాలను తప్పుకుండా పాటించాం. మా యూనిట్ అంతా మాస్కులు ధరించింది. యూనిట్‌లో జ్వరాన్ని కొలిచే సామాగ్రిని, వైద్య సిబ్బందిని పెట్టుకొన్నాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసిన తర్వాతే షూట్‌కు ప్లాన్ చేశాం అని రకుల్ పేర్కొన్నారు.
హిందీలో దే దే ప్యార్ దే సినిమా తర్వాత ప్రస్తుతం కేశవ్ నాయర్ దర్శకత్వం వహించే చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో ఆయలాన్, ఇండియన్ 2 చిత్రాల్లో కనిపిస్తారు.ఇటీవల ఆమె నటించిన ఎన్జీకే, మన్మథుడు, మార్జవాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తాపడ్డాయి.


Click it and Unblock the Notifications











