Rakul Preet Singh పింక్​ డ్రెస్​లో రకుల్​ ప్రీత్​ సింగ్.. ఫ్యాన్స్‌కు కైపెక్కించేలా ఫోటోలు

అనతి కాలంలోనే స్టార్​ హీరోయిన్​గా ఎదిగిపోయింది ఫిట్​నెస్​ భామ రకుల్ ప్రీత్​ సింగ్​. కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​లో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తర్వాత వరుస పెట్టి అగ్ర హీరోలతో జత కట్టిన రకుల్​ బాలీవుడ్​లో పాగా వేసింది. అక్కడ తన అందచందాలతో, అభినయంతో చేతినిండా సినిమాలతో ఫుల్​ బిజీగా మారిపోయింది. తర్వాత తెలుగు ప్రేక్షకులకు దూరమైన ఈ పంజాబీ బొమ్మ ఇటీవల కొండపొలం చిత్రంతో అలరించింది. సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే రకుల్​ ప్రీత్ సింగ్​ తాజాగా పోస్ట్​ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

పంజాబీ భామ రకుల్​ ప్రీత్​సింగ్​ కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే అప్పటికే ప్రభాస్​ సరసన మిస్టర్​ పర్​ఫెక్ట్​ సినిమాతో పరిచయం కావాల్సింది. పలు కారణాలతో కొంత వరకు షూటింగ్​ చేసిన తర్వాత రకుల్​ను వద్దనుకున్నారని టాక్.

కొండపొలంతో చివరిగా..

కొండపొలంతో చివరిగా..

వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​ సినిమా తర్వాత స్టార్​ హీరోల సరసన నటించి అతికొద్ది సమయంలోనే స్టార్​ హీరోయిన్​గా పాపులర్​ అయింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధ్రువ వంటి తదితర హిట్​ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న రకుల్ చివరిగా కొండపొలం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు అలరించింది.

సెలబ్రిటీ కొరియోగ్రాఫర్​ వద్ద డ్యాన్స్​ శిక్షణ..

సెలబ్రిటీ కొరియోగ్రాఫర్​ వద్ద డ్యాన్స్​ శిక్షణ..

అయితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ కొరియోగ్రాఫర్​ డింపుల్​ వద్ద రకుల్​ డ్యాన్స్​ నేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు పలు షార్ట్​ డ్యాన్స్​ వీడియోస్​ అప్​లోడ్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల మషూక అనే మ్యూజిక్​ వీడియో చేసింది రకుల్​.

 బాయ్​ఫ్రెండ్​తో కలిసి..

బాయ్​ఫ్రెండ్​తో కలిసి..

ఈ మ్యూజిక్​ వీడియో రకుల్​ ప్రీత్​ సింగ్​గా అల్ట్రా గ్లామరస్​గా కనిపించి, తన డ్యాన్స్​తో వావ్​ అనిపించింది. ఈ వీడియో సింగిల్​ను తన బాయ్​ఫ్రెండ్​, నిర్మాత జక్కీ భగ్నానీతో కలిసి రూపొందించింది. అయితే ఈ పాటను మొదటగా హిందీ పాప్​ సాంగ్​గానే రూపొందించాలనుకున్నారట.

ప్రేమను తెలిపేందుకే..

ప్రేమను తెలిపేందుకే..

కానీ ఆమెకు స్టార్​డమ్​ తీసుకొచ్చిన తెలుగు, తమిళ అభిమానుల కోసం ఆ రెండు భాషల్లోనూ విడుదల చేయాలని అలాగే రూపొందించినట్లు ఓ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది కూల్​ బ్యూటీ రకుల్​ ప్రీత్​. దీంతో తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇదొక అవకాశంగా ఉపయోగించుకున్నా అని కూడా చెప్పుకొచ్చింది.

స్టార్ క్యాస్ట్​తో చేసిన కూడా..

స్టార్ క్యాస్ట్​తో చేసిన కూడా..

ఇక రకుల్​ ప్రీత్​ సింగ్​ హిందీ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల అటాక్, రన్​ వే 34, అటాక్​ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అమితాబ్​ బచ్చన్, అజయ్​ దేవగణ్​ వంటి స్టార్​ క్యాస్ట్​తో నటించిన రన్​ వే 34 కొంత మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకున్న జాన్​ అబ్రహంతో చేసిన అటాక్​ డిజాస్టర్​గా నిలిచింది.

హిందీ సినిమాలతో బిజీ..

హిందీ సినిమాలతో బిజీ..

ప్రస్తుతం ఛత్రీవాలీ, డాక్టర్​ జీ, థ్యాంక్​ గాడ్​, అక్షయ్​ కుమార్​తో సిండ్రెల్లా సినిమాలతో బిజీగా ఉంది రకుల్. సిండ్రెల్లా మూవీ తమిళలంలో సూపర్​ హిట్​ కొట్టిన రత్సాసన్ సినిమాకు రీమేక్​గా రానుంది. ఈ చిత్రం తెలుగులో రాక్షసుడుగా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాతోనే చాలా కాలంగా హిట్​ లేని బెల్లంకొండ సాయి శ్రీనివాస్​ విజయం సాధించాడు.

కవ్విస్తోన్న రకుల్​ చూపులు..

కవ్విస్తోన్న రకుల్​ చూపులు..

ఇక ఇదిలా ఉంటే తరచూ సోషల్​ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉండే రకుల్ ప్రీత్​ సింగ్​ తాజాగా కొన్ని ఫొటోలను షేర్​ చేసింది. పింక్​ కలర్​ డ్రెస్​లో ఉన్న రకుల్​ కైపుగా చూస్తూ కవ్విస్తోంది. పింక్​ దుస్తులు ధరించిన రకుల్​ గులాబీలా మెరిసిపోతూ హాట్​గా థై షో చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X