ఒంటిపై బట్టలు లేనట్లే, లోపలి అందాలు చూపిస్తూ .. బ్లాక్ డ్రెస్‌లో రకుల్ ఫ్రీ షో!
ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి గ్లామర్ ఫీల్డ్ అయిన సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సక్సెస్ కొట్టారు రకుల్ ప్రీత్ సింగ్. క్రమశిక్షణ, సమయపాలన, కష్టపడే తత్వాన్ని తాను తల్లిదండ్రుల నుంచే నేర్చుకున్నానని ఆమె పలుమార్లు తెలిపారు. జీవితంలో అనుకున్నది సాధించడానికి ప్రాణం పెట్టి పనిచేయాలని రకుల్ ఎప్పుడూ చెబుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
నిజానికి పాకెట్ మనీ కోసమే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత కన్నడంలో గిల్లి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రకుల్.. తర్వాత మోడలింగ్‌లో దూసుకెళ్లారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురులో నటించే అవకాశం ముందుగా రకుల్‌నే వరించింది. అయితే కొన్ని కారణాలతో ఆమె ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. తెలుగులో కెరటం అనే చిత్రంతో తెలుగువారిని పలకరించారు.

అయితే సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో రకుల్ ప్రీత్ సింగ్‌కు తొలి బ్రేక్ దక్కింది . తను స్టార్‌గా స్థిరపడాలన్న లక్ష్యంతో కష్టపడిన ఆమె.. ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ టార్గెట్ రీచ్ అయ్యారు. అనతి కాలంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ బాబు, కార్తీ వంటి స్టార్స్‌తో నటించే అవకాశం దక్కించుకున్నారు. టాలీవుడ్‌లో వచ్చిన పాపులారిటీతో కోలీవుడ్, బాలీవుడ్‌లలోనూ ఛాన్స్‌లు పట్టేసింది రకుల్. సినిమాల్లో నటిస్తూనే సంపాదనను తెలివిగా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తోంది.
అయితే ప్రస్తుతం ఆమెకు బ్యాడ్‌టైం నడుస్తోంది. హిందీలో ఆమె నటించిన సినిమాలు ఒకటి ఆరా తప్పించి చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తెలుగులో ఒకప్పుడు ఖాళీ లేకుండా సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్‌కు పూర్తిగా దూరమయ్యారు. అయినప్పటికీ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే తాము పెళ్లి పీటలెక్కబోతున్నట్లు రివీల్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రియుడితో ఏడాడుగులు వేసింది రకుల్.
రకుల్ ప్రీత్ సింగ్ .. హిందీలో దే దే ప్యార్ దే 2లో నటిస్తున్నారు. అన్షుల్ శర్మ దీనికి దర్శకుడు కాగా వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. కొద్దిరోజుల క్రితం 34వ పుట్టినరోజుని గ్రాండ్‌గా జరుపుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. స్నేహానికి ప్రాణమిచ్చే ఈమె.. వారి కోసం ఏమైనా చేస్తుంది. తమన్నా, రాశీ ఖన్నా, కృతి సనన్, ప్రగ్యా జైస్వాల్ వంటి హీరోయిన్‌లతో రకుల్ క్లోజ్‌గా ఉంటారు. రెండ్రోజుల క్రితం కృతి సనన్ ఇచ్చిన పార్టీలో తమన్నాతో కలిసి రకుల్ సందడి చేశారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటారు. తాజాగా బ్లాక్ కలర్ డీప్ నెక్ డ్రెస్‌లో ఆమె పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం రకుల్ అందాలపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











