Rakul Preet Singh : బ్లూ కలర్ డ్రెస్‌లో రకుల్ స్టన్నింగ్ లుక్ .. ఆ పార్ట్‌‌ని అలా కవర్ చేస్తూ

సాధారణంగా ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబంలో అంతా ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో తెలిసిందే. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి టాప్ హీరోయిన్‌గా ఎదిగారు రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నారు రకుల్. ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా హిందీలోనే తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

10 అక్టోబర్ 1990న పంజాబీ సిక్కు కుటుంబంలో న్యూఢిల్లీలో జన్మించారు రకుల్ ప్రీత్ సింగ్. ఆమె తండ్రి కుల్వీందర్ సింగ్ ఆయన ఆర్మీలో ఆఫీసర్.. తల్లి రాజేందర్ కౌర్. ధౌలా కౌన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం, ఢిల్లీలోని జీసస్ అండ్ మేరి కాలేజీలో మ్యాథమేటిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు రకుల్. క్రమశిక్షణ, సమయపాలన, కష్టపడే తత్వాన్ని తన పేరెంట్స్ నుంచే నేర్చుకున్నానని రకుల్ ఎన్నో వేదికలపై తెలిపారు ఈ ముద్దుగుమ్మ. వారే తనకు ఇన్స్‌పిరేషన్ అని.. జీవితంలో అనుకున్నది సాధించడానికి తనను వెన్నుతట్టి ప్రోత్సహించారని తన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెబుతుంటారు.

rakul preet singh sizzling hot look in Blue color sleeveless dress

అందరూ నటనపై ఆసక్తితోనో, ప్యాషన్‌తోనో సినీ పరిశ్రమలో అడుగుపెడుతుంటారు. అయితే రకుల్ మాత్రం కేవలం పాకెట్ మనీ కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టారట. తొలుత కన్నడంలో గిల్లి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రకుల్.. తర్వాత మోడలింగ్‌లో దుమ్మురేపారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో తెలుగువారిని పలకరించారు . ఈ సినిమాలో ఆమెకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది . వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. చిన్నా, పెద్దా అందరికీ రకుల్ ప్రీత్ సింగే హీరోయిన్‌గా కావాలి అన్నంతగా బలమైన ముద్రవేశారు.

టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్‌లలోనూ ఛాన్స్‌లు పట్టేసింది రకుల్. తన సంపాదనను తెలివిగా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఆయనను పెళ్లాడారు. ప్రస్తుతం హిందీలో దే దే ప్యార్ దే 2లో నటిస్తున్నారు. అన్షుల్ శర్మ దీనికి దర్శకుడు కాగా వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

మానసికంగా, శారీరకంగా బలంగా ఉన్నప్పుడే ఏమైనా సాధించగలమని రకుల్ విశ్వసిస్తారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా వర్కవుట్స్, యోగాను మాత్రం నిర్లక్ష్యం చేయరు. అయితే కొద్దిరోజుల క్రితం 80 కేజీల బరువు ఎత్తే క్రమంలో ఆమెకు గాయం కావడంతో వైద్యులు కొన్నాళ్లు బెడ్ రెస్ట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటారు. తాజాగా బ్లూ కలర్‌లో ఉన్న వెరైటీ డ్రెస్‌ వేసి ఎద అందాలను కవర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చారు రకుల్ . మరి ఇంకేందుకు ఆలస్యం రకుల్ అందాలను మీరూ చూసేయండి.

More from Filmibeat

Read more about: rakul preet singh movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X