Rakul Preet Singh : బెంచ్‌పై అందాలన్నీ పడుకోబెట్టి .. హద్దులు దాటేసిన రకుల్
ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. క్రమశిక్షణ, సమయపాలన, కష్టపడే తత్వాన్ని తన పేరెంట్స్ నుంచే నేర్చుకున్నానని రకుల్ ఎన్నో వేదికలపై తెలిపారు. వారే తనకు ఇన్స్‌పిరేషన్ అని.. జీవితంలో అనుకున్నది సాధించడానికి తనను వెన్నుతట్టి ప్రోత్సహించారని తన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెబుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
అందరూ నటనపై ఆసక్తితోనో, ప్యాషన్‌తోనో సినీ పరిశ్రమలో అడుగుపెడుతుంటారు. అయితే రకుల్ మాత్రం కేవలం పాకెట్ మనీ కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టారట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు చెప్పారు కూడా. తొలుత కన్నడంలో గిల్లి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రకుల్.. తర్వాత మోడలింగ్‌లో దుమ్మురేపారు. అప్పుడెప్పుడో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురులో నటించే అవకాశం ముందుగా రకుల్‌నే వరించింది. అయితే కొన్ని కారణాలతో ఆమె ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. కెరటం అనే చిత్రంతో తొలిసారిగా తెలుగువారిని పలకరించారు.

అయితే సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో రకుల్ ప్రీత్ సింగ్‌కు నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది . ఫీల్డ్ ఏదైనా నెంబర్ వన్‌గా ఉండాలనే లక్ష్యంతో కష్టపడిన ఆమె.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. ఒకదేశలో తెలుగులో ఏ సినిమా రిలీజైనా అందులో రకుల్ ఉండాల్సిందే.. చిన్నా, పెద్దా అందరికీ రకుల్ ప్రీత్ సింగే హీరోయిన్‌గా కావాలి అన్నంగా ఆమె బ్రాండ్ తెచ్చుకున్నారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ బాబు వంటి స్టార్స్‌తో నటించే అవకాశాన్ని రకుల్ త్వరగానే దక్కించుకున్నారు. టాలీవుడ్‌లో వచ్చిన పాపులారిటీతో కోలీవుడ్, బాలీవుడ్‌లలోనూ ఛాన్స్‌లు పట్టేసింది రకుల్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే లక్ష్యానికి అనుగుణంగా సంపాదనను తెలివిగా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆమెకు బ్యాడ్‌టైం నడుస్తోంది. హిందీలో ఆమె నటించిన సినిమాలు ఒకటి ఆరా తప్పించి చాలా వరకు నిరాశపరిచాయి.
బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే తాము పెళ్లి పీటలెక్కబోతున్నట్లు రివీల్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రియుడితో ఏడాడుగులు వేసింది రకుల్. ప్రస్తుతం హిందీలో దే దే ప్యార్ దే 2లో నటిస్తున్నారు. అన్షుల్ శర్మ దీనికి దర్శకుడు కాగా వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటారు. తాజాగా వైట్ కలర్ డ్రెస్ వేసి ఓ బెంచ్‌పై అందాలను ఆరబోశారు. డీప్ నెక్ బ్లౌజ్‌లో మెడలో ముత్యాల దండను చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం రకుల్ అందాలను మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











