బాలయ్య పక్కన రకుల్ ప్రీత్ సింగ్ జోకులు.. బాగా చేశానా లేదా!
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుంలా ఈ వేడుకకు హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు లాంటి ప్రముఖ నటులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆడియో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నందమూరి తారక రామారావు, దిగ్గజ నటి శ్రీదేవి కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వేటగాడు చిత్రం అయితే అప్పట్లో ఒక సంచలనం. శ్రీదేవితో కలసి ఎన్టీఆర్ వేసిన స్టెప్పులకు అప్పటి సినీ అభిమానులంతా ఫిదా అయ్యారు. అలాంటి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ ఆడియో వేడుకలో సరదాగా మాట్లాడింది.
శ్రీదేవి పాత్రలో నటించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. క్రిష్ నన్ను నమ్మి ఈ పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. ఇంతటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం కల్పించిన బాలకృష్ణగారికి కృతజ్ఞతలు అంటూ రకుల్ ప్రీత్ తెలిపింది. బాలకృష్ణ గారు వాస్తవానికి శ్రీదేవితో సినిమాలు చేయలేదు.. కానీ ఈ చిత్రంలో చేశారు అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. నేను బాగా చేశానా లేదా అంటూ పక్కనే ఉన్న బాలయ్యని అడిగింది.



Click it and Unblock the Notifications











