కొత్త బిజినెస్‌ను మొదలుపెట్టిన రకుల్.. సంపాదన అంతా దానికోసమే..
దక్షిణాదితోపాటు హిందీ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ నటిగానే విభిన్నమైన పాత్రలు పోషిస్తూనే పలు రకాల బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఫిట్‌నెస్ వ్యాపారంలోకి అడుగుపెట్టి పలు ప్రాంతాల్లో ఫిట్‌నెస్ సెంటర్లను ప్రారంభించారు. తాజాగా రకుల్ వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఫుడ్, ఫిట్‌నెస్, సినిమాలు, ఫ్రెండ్స్ అలవాట్ల గురించి తాను ప్రారంభించిన యూట్యూబ్ ద్వారా వెల్లడిస్తానని ఓ పీడియో ద్వారా వెల్లడించింది.

రకుల్ ప్రీత్ సింగ్ యూట్యూబ్ ఛానెల్
తన సొంత పేరు రకుల్ ప్రీత్ పేరుతోనే యూట్యూబ్ ఫ్రారంభించిన విషయాన్ని చెబుతూ.. నా చేతిలో చాలా సమయం ఉంది. అందుకే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాలని అనుకొన్నాను. చాలా ఫన్ విషయాలను అందులో ప్రసారం చేస్తాను అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. ఈ యూట్యూబ్ ద్వారా ప్రజలకు వినోదంతోపాటు ఆరోగ్య చిట్కాలను అందిస్తామన్నారు.
ప్రధాని కేర్ ఫండ్‌కు నిధులు
నా యూట్యూబ్ ఛానెల్‌ను సదుద్దేశంతో ప్రారంభించాను. ఆ ఛానెల్ నుంచి వచ్చిన ప్రతీ పైసా ప్రభుత్వ సేవా కార్యక్రమాలకు వెళ్తాయి. ప్రధాని కేర్ ఫండ్ కు ఇస్తాను. కాబట్టి అందరూ నా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి. ఆనందంతో జీవిస్తూ మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి అని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

గురగ్రామ్‌లో పేదలకు సాయం
కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత మురికివాడల్లో జీవిస్తున్న ప్రజలు తిండిలేక బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రకుల్ ప్రీత్ సింగ్ గురుగ్రామ్‌లోని తన ఇంటికి సమీపంలోని 200 మంది పేదలకు ఆహారం అందించే బాధ్యతను భుజాన వేసుకొన్నారు.
Recommended Video

తల్లిదండ్రులతో కలిసి ఆహారం
తన తల్లిదండ్రులు కుల్విందర్ సింగ్, రాజేందర్ సహాయంతో పేదలకు ఆహార పొట్లాలను అందించే బాధ్యతను చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మా ఇంటి ఏరియాలోని మురికివాడలో చాలా మంది పేదలు ఆహారం లేక బాధపడుతున్నారని గుర్తించారు. దాంతో వెంటనే వారికి ఆర్థికపరంగా, ఆహారం అందించే పరంగా సహాయం అందించాలని నిర్ణయించుకొన్నాం అని రకుల్ తెలిపారు.


Click it and Unblock the Notifications











