రాత్రి పగలు తెలియడం లేదు.. ప్రియుడితో రకుల్ ప్రీత్ సింగ్ ఘాటైన రొమాన్స్.. మాల్దీవ్ ట్రిప్ ఫోటోలు వైరల్
సినిమా సెలెబ్రిటీలు వెకేషన్ అనగానే మాల్దీవ్స్ వెళ్ళిపోతుంటారు. అక్కడ సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ పరవశించిపోతారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ ఇదే వరస. వేసవి తాపాన్ని తట్టుకోలేక తాజాగా హాట్ బాంబ్ రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో ప్రియుడితో కలిసి విహార యాత్రను ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవుల్లో సముద్రం పక్కన సూర్యుడి వెలుగులో హొయలుపోతున్న ఫోటోలను, వీడియోలను ఇన్స్ టా వేదికగా షేర్ చేసింది. ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..
సముద్ర తీరంలో అడ్వెంచర్స్ చేస్తున్న వీడియోలను క్లబ్ చేసి మాంటేజ్ వీడియోను పోస్ట్ చేసి, ఇంతవరకు ఇలాంటి బీచ్‌ను, ఇసుకను, సూర్యుడిని చూడలేదంటూ క్యాప్షన్ పెట్టింది. అంతకుముందు రెడ్ కలర్ స్విమ్ వేర్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసి, ఫాలోవర్స్ కు ట్రీట్ ఇచ్చింది. అంతేకాదు, బ్లూ అండ్ వైట్ కలర్ గౌనులో బీచు పక్కనే ఫోటో దిగి, మ్యాజిక్ లైట్ మ్యాజిక్ మూమెంట్స్ అని క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు ఇంటర్నెట్ లో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోలకు లైకుల వరద పెరిగిపోతుంది. కామెంట్ల వర్షం కురుస్తోంది.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమా విషయాలకు వస్తే, ప్రస్తుతం ఐ లవ్ యూ అనే సినిమాలో నటిస్తోంది. పావలి గులాటి, అక్షయ్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలుగా కనిపిస్తున్న ఈ చిత్రం నుండి చిన్నపాటి గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సినిమా కోసం ఎదురుచూసేలా చేసింది. అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐ లవ్ యూ సినిమా, జూన్ 16వ తేదీ నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గౌరవ్ బోస్, జ్యోతి దేశ్ పాండే, సునీర్ కేతేర్ పాల్ నిర్మిస్తున్నారు.
ఇక సత్య ప్రభాకరన్(రకుల్ ప్రీత్ సింగ్) అనే జాబ్ చేసే అమ్మాయి, అనుకోకుండా ప్రేమలో పడుతుంది. తమ ప్రేమను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలనుకునే టైమ్ లో ఆమె జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల లైనప్ విషయానికి వస్తే.. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఇండియన్ 2 కూడా ఉంది. ఇంకా, అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న కామెడీ చిత్రంలోనూ రకుల్ నటిస్తుంది. అయితే తెలుగు సినిమాల్లో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కనిపించడం లేదు. ఆమె చివరగా నటించిన తెలుగు చిత్రం కొండపొలం. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి థియేటర్లలో సరైన స్పందన రాలేదు. మరి మళ్ళీ తెలుగు సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











