ఫిట్ నెస్ పాప రకుల్ ఓవర్ ఎక్స్‌పోజింగ్.. షోలో పైనా కిందా చూపిస్తూ రచ్చ!
ఒక సమయంలో తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా యూత్‌ను అట్రాక్ట్ చేసింది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ఫిట్ నెస్ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. దీంతో 2022లో బిగ్గెస్ట్ డిజాస్టర్ హీరోయిన్ నిలిచింది. వరుసగా ఫ్లాప్స్ వచ్చిన కూడా రకుల్ కు హిందీలో అవకాశాలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోసే ఈ బ్యూటీ తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది.
చాలా గ్యాప్:తెలుగులో కెరటం అనే చిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ సినిమా కంటే ముందుగా దేశ ముదురు సినిమాకు రకుల్ కు ఆఫర్ రాగా దాన్ని తిరస్కరించింది. తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమెకు సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో అవకాశం లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది.

పాపులర్ హీరోయిన్:వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో ప్రార్థనగా అలరించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత ఆది సాయి కుమార్ రఫ్, గోపిచంద్ లౌక్యం, కరెంట్ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి తదితర సినిమాల్లో నటించింది. పలు అగ్ర హీరోలతో జతకట్టి ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది.
కొండపొలం మూవీతో:టాలీవుడ్ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్లిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ లవ్ స్టోరీగా వచ్చిన యారియాన్ తో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్ కు అంత పెద్ద సక్సెస్ ఇవ్వలేదు. తర్వాత అనేక హిందీ చిత్రాలతోపాటు సౌత్ సినిమాల్లో కూడా అలరించింది. బాలీవుడ్ లో సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ కొండపొలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

మళ్లీ అక్కడికే:క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ కు జోడి కట్టింది స్టన్నింగ్ బ్యూటి రకుల్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో మళ్లీ బాలీవుడ్ కు మకాం మార్చింది. గేతాడాది హిందీలో చేతినిండా ఫుల్ సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన రన్ వే 34, అటాక్ పార్ట్ 1, థ్యాంక్ గాండ్, డాక్టర్ జీ సినిమాలు ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి.

ఘాటు సీన్లు:అన్నింటికంటే అక్షయ్ కుమార్ తో చేసిన కట్ పుట్లి సినిమా నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ విడుదలై పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ ఏడాది రిలీజైన ఛత్రీవాలీ సినిమా కూడా అంత పెద్ద హిట్ కొట్టలేదనే చెప్పాలి. ఆ సినిమాలో ఎప్పుడు చేయనటువంటి పాత్ర కండోమ్ టెస్టర్ గా రకుల్ ప్రీత్ నటించింది. ఇందులో ఆయుష్మాన్ ఖురానాతో ఘాటు లిప్ కిస్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది ఈ బ్యూటి.

బక్కపలచని అందాలు:ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నిత్యం హాట్ షోతో యూత్ ను అట్రాక్ట్ చేస్తుంటుంది కూల్ బ్యూటి రకుల్. తాజాగా అలాంటి హాట్ పిక్స్ కొన్ని షేర్ చేసింది. వీటిలో బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన ఫిట్ నెస్ పాప రకుల్ ప్రీత్ సింగ్ తన బక్కపలుచని ఎద అందాలను, థైస్ బ్యూటిని ఓవర్ గా ఎక్స్ పోజ్ చేసింది. GQ 35 మోస్ట్ ఇన్ ఫ్లూయెన్స్ యంగ్ ఇండియన్ సదస్సులో పాల్గొన్న ఈ భామ హాట్ షోతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











